కొంతమంది మాయ మాటలను నమ్మి రైతులెవ్వరు మోసపోవద్దు..!
-రైతులు భూ సమస్యలు ఏవైనా ఉంటే కార్యాలయంలోని అధికారులను కలవండి.
- తహసీల్దార్ శ్రీనాథ్ వెల్లడి...
న్యూస్ ఇండియా ప్రతినిధి /పెద్దకడుబూరు మండలం సెప్టెంబర్ 10 :- కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం పెద్దకడబూరు మండలంలో కొంత మంది మాయ మాటలకు రైతులు ఎవ్వరు మోసపోవద్దని మండల తహసిల్దార్ శ్రీనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ తహసిల్దారు కార్యాలయానికి వివిధ సమస్యలపై వచ్చే రైతులందరిని కోరుతూ కొంతమంది అమాయకులైన రైతులను టార్గెట్ చేసుకుని ఆఫీస్ లో మీకు మేము పనులు చేపిస్తామని మాయ మాటలు చెప్పి రైతుల దగ్గర డబ్బులు వసూలు చేసుకుంటున్నట్లు కొంత మంది రైతుల ద్వారా దృష్టికి వచ్చిందన్నారు. మరికొందరు స్వయంగా నకిలీ పట్టాలు చేపిస్తున్నారని ఆవిషయం కూడా ఆయన దృష్టికి రావడం జరిగిందన్నారు. అలాంటి వారి మాయ మాటలను రైతులు ఎవ్వరు నమ్మకండన్నారు. మండలంలో రైతులకు ఉన్న భూ సమస్యలు ఏవైనా ఉంటే వాటికీ సంబందించిన ఆధారాలు పత్రాలు తీసుకొని తహసీల్దార్ కార్యాలయంలో సంబంధిత అధికారుల దగ్గరికి వెళ్లి వారితో మీ సమస్యలను గురించి పూర్తిగా వివరించి పరిష్కారం చేసుకోవలసినదిగా రైతులకు తెలియజేశారు. ఒక వేల సమస్య పరిష్కారం కానీ పక్షంలో మా దృష్టికి తీసుకొస్తే సమస్యకు తగిన పరిష్కారం చేస్తామన్నారు. కాబట్టి రైతులు ఎవ్వరు మధ్యవర్థులను నమ్మకండి అని, వృధాగా ఎ ఒక్క రైతు డబ్బులు పోగొట్టుకోవద్దని ఆయన తెలియజేశారు...
Comment List