గణేష్ నిమర్జనానికి వెళ్లిన ట్రాక్టర్ నేరుగా కాలువలోకి దూసుకుపోయింది.
- ఈ ఘటన పెద్దకడుబూరు గ్రామంలో జరిగగింది.
న్యూస్ ఇండియా ప్రతినిధి/ పెద్దకడుబూరు మండలం సెప్టెంబర్ 09 :- వినాయక చవితి సందర్బంగా శనివారం నుంచి సోమవారం వరకు మూడు రోజుల పాటు జరిగిన గణేష్ ఉత్సవాలను పెద్దకడుబూరు మండలం ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రమైన పెద్దకడుబూరు గ్రామంలో దాదాపు 25 గణేష్ విగ్రహాలు కొలువుదీరాయి.గణేష్ మహారాజ్ విగ్రహంనకు ప్రత్యేక మండపాలు ఏర్పాటు చేసి అందంగా అలంకరించడం జరిగింది. వినాయకునికి అనేక రకాల నైవేద్యములు , పండ్లు , పూలు సమర్పించి గణేష్ భక్తి నామాలు స్మరించుకుంటూ ఘనంగా ప్రత్యేక పూజలు చేపట్టారు. భక్తులు వారికున్న కష్టాలను తొలగించి జీవితంలో సుఖసంతోషాలు ప్రసాధించమని వినాయకున్నీ వేడుకున్నారు. చివరిగా సాయంత్రం 5గంటలకు నిమర్జనమంతరం గ్రామంలోని అన్ని మండపాలలోని గణేష్ విగ్రహాలను ఊరేగింపుగా గ్రామ చావిడి దగ్గరకు చేర్చి అక్కడి నుండి వరుసగా డీజె సౌండ్స్ తో విగ్రహాల ముందు చిందులు వేస్తూ , వివిధ రకాల రంగులతో ఒకరినొకరు పూసుకుంటూ , బాణసంచాలు పేలుస్తూ సంతోషంగా బస్టాండ్ ఆవరణం నుండి గ్రామ శివారులోని ఎల్ఎల్ సి పెద్ద కాలువకు చేరుకొన్నారు. అనంతరం పెద్ద కాలువ దగ్గర గణేష్ నిమర్జన కార్యక్రమం జరిగింది. గణేష్ నిమర్జనం ముగిసే వరకు ఎస్ఐ నిరంజన్ రెడ్డి తన పోలీస్ సిబ్బందితో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. అయితే నిమర్జనం అయ్యాక కాలువ ఒడ్డున ఆగి ఉన్న ట్రాక్టర్ అదుపు తప్పి నేరుగా పెద్ద కాలువలోకి దూసుకుపోయింది. అక్కడి స్థానికులు తెలిపిన వివరాల మేరకు గణేష్ నిమర్జనానికి వెళ్లిన కాలి ట్రాక్టర్ ను డ్రైవర్ కాలువ ఒడ్డు పైన ఆపడం జరిగిందని, కొద్దీ క్షణాల్లోనే ఒడ్డున ఉన్న ట్రాక్టర్ గేర్ న్యూట్రల్ కావడంతో నేరుగా కాలువలోకి దూసుకుపోయి నీటిలో పూర్తిగా మునిగిపోయిందన్నారు. వెంటనే జెసిబి సహాయంతో ట్రాక్టర్ ను ఒడ్డుకు చేర్చడం జరిగిందన్నారు. ఏదేమైనప్పటికి కాలువలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్ వల్ల ఎవ్వరికి ఎలాంటి అపాయం కలుగలేదన్నారు. పూర్తిగా నీటిలో మునిగిన ట్రాక్టర్ కండీషన్ గురించిన వివరాలు తెలియాల్సి ఉంది. కార్యక్రమానికి వెళ్లిన ప్రతి ఒక్కరి పై ఆ గననాయకుడి దీవెనలతో అందరు క్షేమంగా ఇల్లు చేరుకున్నారు.
Comment List