ఇంటి పైకప్పు కూలి మహిళా మృతి కుటుంబాన్ని ఆర్థిక సాయం అందజేసిన మంత్రి దామోదర
On
న్యూస్ ఇండియా టేక్మాల్ ప్రతినిధి జైపాల్ మెదక్ జిల్లా టేక్మాల్ మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో శనివారం రాత్రి ఇంటి పైకప్పు కూలి టేక్మాల్ గ్రామానికి చెందిన మంగలి శంకరమ్మ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పందించి బాధిత కుటుంబానికి తక్షణ సహాయం కింద 2 లక్షల 11 వేలు అందజేశారు. ప్రభుత్వ పరంగా బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పురాతన గృహాలలో ఉండేవారు జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
Views: 50
Comment List