ఘనంగా వినాయక చవితి వేడుకలు*
*ఘనంగా వినాయక చవితి వేడుకలు*
*న్యూస్ ఇండియా పెబ్బేర్*
నవరాత్రులు పురస్కరించుకుని పెబ్బేర్ మున్సిపాలిటీ పెబ్బేర్ మండల పరిధి గ్రామాలలో వినాయక చవితి వేడుకలను శనివారం ఘనంగా ప్రారంభించారు మండపాల వద్ద ప్రత్యేక అలంకరణలు చేసి మండపంలో ఉత్సవ కమిటీ సభ్యులు గణనాథుడిని ప్రతిష్టించారు ప్రతి మండపాలలో భక్తులతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు,ఆయా పార్టీలకు చెందిన నాయకులు గణనాధుడికి పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ వాడలో చూసిన గణనాథుడి మండపాలతో కళకళలాడుతున్నాయి. ఊరూరా గణేష్ మండపాలలో రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించిన మండపాలలో ప్రత్యేక సంస్కృతి కార్యక్రమాలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు, తొలిరోజు పూజ కార్యక్రమాల్లో పలు మండలాలలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు రాజకీయ,పార్టీల ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, గణనాథుడికి పూజలు నిర్వహించారు. ప్రజలు సంతోషంగా ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని కోరుకుంటూ ప్రజలు గణపతికి పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పెబ్బేర్ మున్సిపాలిటీ పట్టణ, వివిధ గ్రామాలలో గణపతి నిర్వాహకులు, నాయకులు, ప్రజాపతినిధులు, గ్రామ ప్రజలు
పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Comment List