వరద బాధితులకు సహాయం
న్యూస్ ఇండియా యర్రగొండపాలెం సెప్టెంబర్07:
విజయవాడ జలప్రళయంలో అభాగ్యులుగా మారిన వారిని ఆదుకునేందుకు పట్టణానికి చెందిన ముస్లీం యూత్ సోసైటి తన దాతృత్వం చాటుకుంది.ముస్లిం యూత్ సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితుల సహాయార్థం విరాళాలు సేకరించి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షులు సయ్యద్ ముస్తాక్ అహ్మద్ కు డాక్టర్ షేక్. ఇస్మాయిల్ 25వేల రూపాయల నగదు అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా షేక్ ఇస్మాయిల్ మాట్లాడుతు పృకృతి సృష్టించిన జల విలయతాండవంలో ఎందరో బలైపోయారని,కనీసం త్రాగునీరు,ఆహారం అందక అగచాట్లు పడ్డారని అటువంటి వారిని ఆదుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని అన్నారు.ఈ సందర్భంగా ముస్లీం యూత్ సొసైటి అందించిన సహయార్దానికి సయ్యద్ ముస్తాక్ అహ్మద్ అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలోముస్లిం యూత్ సొసైటీ సభ్యులు సయ్యద్ ముక్తియార్, షేక్ చోటు, షేక్ షరీఫ్,ముస్లిం సోదరులు షేక్ సత్తార్, షేక్ సుభాని, షేక్ అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.
Comment List