సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ
విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎలిమినేటి జంగారెడ్డి
On
సర్వాయి పాపన్న అడుగు జాడల్లో యువత ముందుకు సాగాలని ఏజెఆర్ పాడెషన్ వ్యవస్థాపకులు ఎలిమినేటి జంగారెడ్డి యువతకు పిలుపు నిచ్చారు.గురువారం మండల పరిధిలోని పహిల్వాన్ పురం గ్రామాంలో తన స్వంత నిధులతో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహన్ని ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు సబ్బండ వర్గాలకు ఆత్మగౌరవ స్ఫూర్తిగా నిలిచి,ఆనాటి సమాజంలో నెలకొన్న నిరంకుశ రాజరిక పోకడలకు వ్యతిరేకంగా సబ్బండ వర్గాలను ఏకం చేసి, పాపన్న పోరాడిన తీరు గొప్పదన్నారు.ఆర్థికంగా ఎనుకబడిన పెదవారికి సేవ చేయలని పిలుపునిచ్చారు. ఏజెఆర్ పాండేషన్ ఆద్వర్యంలో అనేక సేవ కార్యక్రమాలు ముందు ముందు చేపడతానని అన్నారు.ఈకార్యక్రమంలో గ్రామస్థులు,గౌడ కులస్తులు, తదితరులు పాల్గున్నారు.
Views: 20
Comment List