కూతురు కనబడటం లేదని పోలీస్ స్టేషన్ లో తండ్రి ఫిర్యాదు
పెద్దకడుబూరు మండలం ఎస్ఐ నిరంజన్ రెడ్డి వెల్లడి
By Venkat
On
మంచోది అరుణ
న్యూస్ ఇండియా ప్రతినిధి/పెద్దకడుబూరు మండలం ఆగస్టు 31 :- కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోని మండల కేంద్రమైన పెద్దకడబూరు గ్రామానికి చెందిన హరిజన మంచోది దేవదాసు కూతురు మంచోది అరుణ వయసు 20సంవత్సరాలు బుధవారం (28-08-2024) తేదీ మధ్యాహ్నం 12.30 గంటలకు ఇంట్లో నుండి బయటికి వెళ్ళి వస్తానని వెళ్లిన అమ్మాయి తిరిగి ఇంటికి రాలేదని శనివారం తల్లిదండ్రుల నుంచి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు వచ్చిందని ఎస్ఐ నిరంజన్ రెడ్డి పత్రిక విలేకరుల సమావేశంలో తెలిపారు. ఎస్ఐ మాట్లాడుతూ తల్లిదండ్రులతో బయటికి వెళ్ళి వస్తానని ఇంటి నుండి వెళ్లిన కూతురు మూడు రోజులు గడిచిన ఇంతవరకు రాకపోవడంతో శనివారం (31-08-2024) తేదీన తండ్రి దేవదాసు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Views: 14
Tags:
Comment List