మణుగూరులో జలప్రళయం
అధికారులు అప్రమత్తమై అత్యవసర సేవలందించాలి
కలెక్టర్ జితేష్ వి పాటిల్
మణుగూరు ( న్యూస్ ఇండియా) సెప్టెంబర్ 1:మణుగూరు మున్సిపల్ పరిధిలో జలప్రళయం జిల్లా యంత్రాంగం వెంటనే పునరావాస కార్యక్రమాలు చేపట్టాలి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు.మణుగూరు 30 ఏళ్ల చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో జలప్రళయం. కట్టవాగు, కోడిపుంజుల వాగు ఉదృత ప్రవాహం ఫలితంగా పట్టణ ప్రధాన రహదారిపై మోకాళ్ళ లోతు చేరిన నీరు. నీట మునిగిన సుందరయ్య నగర్, వినాయక నగర్, బాలాజీ నగర్, కుంకుడు కాయల చెట్ల గుంపు, గాంధీనగర్, కాళీమాత ఏరియా ఆదర్శనగర్, మరియు చేపల మార్కెట్ ప్రాంతం. రెవిన్యూ, మున్సిపల్ సిబ్బంది, వైద్య ఆరోగ్యశాఖ,పోలీసు సిబ్బంది అందరూ చైతన్యవంతులై లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షితప్రాంతాలకు తరలించాలని, ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు వెంటనే ఏర్పాటు చేయాలని,వైద్య ఆరోగ్య సిబ్బంది అప్రమత్తమై అత్యవసర సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
Comment List