అటహాసంగా ప్రారంభమైన నేషనల్ స్పోర్ట్స్ డే
ప్రారంభించిన జిల్లా కలెక్టర్ జితిష్ వి పాటిల్
మేజర్ ధ్యాన్ చంద్ పుట్టినరోజున పురస్కరించుకొని కార్యక్రమం
కొత్తగూడెం (న్యూస్ ఇండియా) ఆగస్టు 28: నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో ప్రభుత్వ ఉద్యోగులకు క్రీడలను జిల్లా కలెక్టర్ జితిష్ వి పాటిల్ జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో బుధవారం అటహాసంగా ప్రారంభించారు. ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు.ఈ కార్యక్రమానికి జిల్లా యువజన క్రీడల అధికారి పరంధామరెడ్డి అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రముఖ హకి క్రీడాకారుడు , మేజర్ ధ్యాన్ చంద్ పుట్టినరోజును పురస్కరించుకొని ప్రతి ఏటా జాతీయ క్రీడ దినోత్సవంగా జరుపుకుంటున్నట్లుగా తెలిపారు. ప్రతి ఒకరు కూడా క్రీడ స్ఫూర్తిని పెంపొందించుకోవాలని అన్నారు.ఈ క్రీడలలో త్రో బాల్ , చెస్, వాలీ బాల్, 100 మీటర్స్ వాక్ పరుగు పందెం ,క్రికెట్ , బ్యాట్మెంటన్ , టేబుల్ టెన్నిస్, మ్యూజికల్ చైర్, లెమన్ అండ్ స్పూన్ , టగ్ ఆఫ్ వార్ క్రీడలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా క్రీడాకారులు ప్రభుత్వ (ఉద్యోగులు) క్రీడా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Comment List