ఆపరేటర్ తో రిజిస్ట్రేషన్ దండా కొనసాగిస్తున్న ఎమ్మార్వో
ఆపరేటర్ చేతికి ఎమ్మార్వో గిరి....ఎమ్మార్వో లేకుండానే రిజిస్ట్రేషన్ ప్రక్రియ
ఆపరేటర్ తో రిజిస్ట్రేషన్ దండా కొనసాగిస్తున్న ఎమ్మార్వో*
*ఆపరేటర్ చేతికి ఎమ్మార్వో గిరి....ఎమ్మార్వో లేకుండానే రిజిస్ట్రేషన్ ప్రక్రియ*
ఎమ్మార్వో లేకుండా తలుపులు వేసి రిజిస్ట్రేషన్ కొనసాగింపు
*రాత్రి ఎనిమిది అయిన ఆగని రిజిస్ట్రేషన్లు..... కనిపించని ఎమ్మార్వో*
*కార్యాలయంలో పైసలు ఇస్తేనే పైలు కదులుతుందని ఆరోపణలు*
*కలెక్టర్ చొరవ చూపి ఈ దందాకు అడ్డుకట్ట వేస్తారా లేదా చూడాలి....? బాధితులు*
స్థానిక పట్టణ కేంద్రంలో ఎమ్మార్వో కార్యాలయంలో అంతా ఆపరేటర్ తో మాట్లాడి భూ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం వచ్చిందని లబ్ధిదారులు అంటున్న సంఘటన. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయం కు రాకుండానే ఆపరేటర్ చేతిలో పెత్తనం పెట్టి ఇష్టా రాజ్యాంగ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఎవరైనా ఫోన్ చేసి ఎమ్మార్వో ను అడిగితే తను ఇక్కడ ఉన్నాను అక్కడ ఉన్నాను అంటూ వస్తున్న అంటూ చెప్పుకుంటూ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఎమ్మార్వో కనిపించకపోవడం, హాస్యాస్పదంగా మారింది. అయినా కూడా రిజిస్ట్రేషన్లు ఆగకుండా కార్యాలయంలో ఆపరేటర్ నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. దాంతోపాటు చేతివాటం అందిన ఫైలు ముందు అందని ఫైళ్లను అడుగున పెడుతూ ఆపరేటర్ ఇష్టారాజ్యంగా పనిచేస్తున్నాడని, వదంతులు వినిపిస్తున్నాయి. కానీ బాధితులు మాత్రం ఇది నిజమే అని చెప్పుకొస్తున్నారు. ఆఫీసు వేళలో కాకుండా రాత్రి 8 గంటల సమయం లో కూడా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ తొర్రూరు ఎమ్మార్వో కార్యాలయంలో కొనసాగడం, విశేషం. (ఫైర్ ఓ కార్లు పైసలు) లేని వారు ఆఫీస్ చుట్టూ ఎంత తిరిగినా ఎలాంటి పని కూడా కావడంలేదని, ఇదేమిటి అని ఆపరేటర్ని ప్రశ్నిస్తే ఎమ్మార్వో లేడు అది నా నుండి కాదు అంటూ బాధితులను గురాకాయిస్తున్నాడని చెప్పుకొస్తున్నారు. ఇంత జరుగుతున్న ఎమ్మార్వో మాత్రం ఎవరికి కూడా అందుబాటులో ఉండకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. తహసిల్దార్ కార్యాలయంలో అంతా నా ఇష్టం అన్న చందంగా ఆపరేటర్ ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయంలో పైసలిస్తేనే ఫైల్ కదులుతుందని బాధితులు బావాటంగానే చర్చించుకుంటున్నారు. ఈ అంశంపై కొంతమంది పత్రికా విలేకరులు చరవాణి ద్వారా తహశీల్దార్ ను వివరణ కోరగా సరియైన సమాధానం చెప్పకుండా దాటవేయడం గమనార్హం. కావున జిల్లా కలెక్టర్ ఈ అంశంపై విచారణ చేపట్టి, స్థానిక ఎమ్మార్వో పై కంప్యూటర్ ఆపరేటర్ ఆగడాలపై విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకొని ఈ రకం కొత్త దందాకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు, బాధితులు కోరుతున్నారు.
Comment List