యునైటెడ్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం..
On
ఇబ్రహీంపట్నం, జూన్ 20 (న్యూస్ ఇండియా ప్రతినిధి): యునైటెడ్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం..ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలం జపాల్ గ్రామం లో యునైటెడ్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణి చేసారు. ఈ సందర్బంగా ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ…విద్య ప్రతి వ్యక్తి జీవితంలో ఎంతో కీలకమైనదని ఎందుకంటే ఇది వారి జీవితాలను మార్చగల శక్తివంతమైన ఆయుదం అని ఇది వ్యక్తిగత ఎదుగుదలకు, సమాజం అభివృద్ధికి మార్గదర్శకంగా ఉంటుందన్నారు. విద్యతోనే మనం సమాజంలో మంచి మార్పును తెచ్చుకోగలమని. విద్యార్థులకు నాణ్యమైన విద్యావకాశాలు కల్పిస్తే అది మన దేశ భవిష్యత్తుని నిర్దేశిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు కృష్ణ,రాము, సుమంత్ రెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Views: 8
About The Author
Related Posts
Post Comment
Latest News
స్వతంత్ర పోరాట వీరుల స్ఫూర్తి నిచ్చిన సిపిఐ కి 100 ఏళ్లు
26 Dec 2024 16:46:03
సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా ఆధ్వర్యంలో కార్యక్రమం
Comment List