ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి,జిల్లా కార్యవర్గం సమావేశం

ప్రతి జర్నలిస్టుకు అండగా ఏపీయూడబ్ల్యూజే

By Khasim
On
ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి,జిల్లా కార్యవర్గం సమావేశం

ప్రభుత్వం విలేకర్ల సమస్యలు పరిష్కరించాలని కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు పట్టణం లో ఆంధ్ర ప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) కర్నూలు జిల్లా కార్యవర్గం జిల్లా అధ్యక్షులు ఈ. నాగరాజు గౌడ్,ప్రధానకార్యదర్శి శ్రీనివాస గౌడ్,

ఐ జె యు జాతీయ సమితి సభ్యులు గోరంట్ల కొండప్ప, కె. నాగరాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు హరికిషన్,కోశాధికారి అంజి, ఆర్గనైజింగ్ కార్యదర్శి సుంకన్న, జిల్లా వైస్ ప్రసిడెంట్ జాలవాడి భాష, నూర్ బాషా, చాంద్ భాషా ఆధ్వర్యం లో ఎమ్మిగనూరు తాలూకా అధ్యక్షలు బి.శ్రీనివాసనాయుడు, పట్టణ అధ్యక్షలు జిబి పరమేశ్వర, కార్యదర్శులు చిన్నాకుల నాగరాజు, వర్కింగ్ ప్రసిడెంట్ 

రామకృష్ణ, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎం. ఈరన్న, కోశాధికారి అశోక్ పాల్గొని ఏర్పాటు చేసిన సమావేశం లో ఏపీయూడబ్ల్యూజే జిల్లా నాయకులు పేర్కొన్నారు.ఈ సంధర్భంగా గత కార్యక్రమాల సమీక్ష, సభ్యత్వం నమోదు,డైరీ యాడ్స్ క్లియర్ చేయడం, సంక్షేమ నిధి, తదితర అంశాలపై చర్చించారు.ఈ సందర్భంగా కర్నూలు జిల్లా ఏపీయూడబ్ల్యూజే నాయకులు మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం లో జర్నలిస్టుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, నూతనంగా ఏర్పాటు చేసిన టీడిపి ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు తాము ఎన్నికల్లో మేనిఫెస్టో లో చెప్పిన ప్రకారం జర్నలిస్టులకి ఇళ్ళ స్థలాలు, పక్కా ఇళ్ళ నిర్మాణం చేపడతామని,అలాగే అర్హత ఉన్న ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ ఇవ్వాలని,హెల్త్ కార్డులు, కార్పొరేట్ పాఠశాలలో జర్నలిస్టుల పిల్లల అందరికి వందశాతం ఉచిత విద్య అందించాలని తెలిపారు. కనుక జర్నలిస్టుల సమస్యలను తక్షణమే స్పందించి పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారుIMG-20240620-WA1722.

Views: 127
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List