విద్యార్థులే కార్మికులైన వేళ.... విద్యార్థుల చేత స్వీపర్ పనులు చేయిస్తున్న ఉపాధ్యాయులు

ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము : రాములు నాయక్, ఎంఈఓ తొర్రూరు

విద్యార్థులే కార్మికులైన వేళ.... విద్యార్థుల చేత స్వీపర్ పనులు చేయిస్తున్న ఉపాధ్యాయులు

విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన పాఠశాల యాజమాన్యం గతి తప్పింది. స్వీపర్ తో చేయించాల్సిన పనులను విద్యార్థుల చేత చేయిస్తున్నారు. సభ్యసమాజం సిగ్గు పడే విధంగా పాఠశాల విద్యార్థుల చేత చెత్తను ఉడిపిస్తున్నారు. అవమానకరమైన ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం దుబ్బ తండ పాఠశాలలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వేసవి సెలవులు ముగిశాక పాఠశాల మళ్ళీ తెరుచుకోగానే, పాఠశాల గదులు అధిక దుమ్ము ధూళితో నిర్మానుష్యంగా మారటంతో పాఠశాల స్వీపర్ చేయవలసిన పనులను మొదటి రోజు ఎంతో సంతోషంగా పాఠశాలకు వచ్చిన విద్యార్థుల చేత చీపురు పట్టి ఉడిపించడంతో ఉపాధ్యాయుడు యాకూబ్ రెడ్డి పై పిల్లల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పాఠశాలలు తెరవక ముందే వారం రోజుల క్రితం బడిబాట కార్యక్రమం చేపట్టడం జరిగింది.అప్పుడే పాఠశాలలను శుభ్రం చేసుకోవచ్చు కదా అని స్థానికులు చెబుతున్నారు.కానీ విద్యార్థులతో చెత్తను ఊడ్పించడంతో పాటు వారితోనే ఆ చెత్తను బయట వేయించారు. విద్యార్థులతో ఈ పనులు చేయిస్తున్నారని తెలుసుకున్న వారి తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యాన్ని తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.అప్పుడే పాఠశాలలను శుభ్రం చేసుకోవచ్చు కదా అని స్థానికులు చెబుతున్నారు. కానీ విద్యార్థులతో చెత్తను ఊడ్పించడంతో పాటు వారితోనే ఆ చెత్తను బయట వేయించారు. విద్యార్థులతో ఈ పనులు చేయిస్తున్నారని తెలుసుకున్న వారి తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యాన్ని తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. తమ పిల్లలతో పాఠశాలను ఎలా ఊడ్పిస్తారని ప్రశ్నించారు.తమ బిడ్డలను ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తే న్యాయపరమైన విద్య అందుతుందని పంపిస్తే పాఠశాల యాజమాన్యం తమ పిల్లలతో అవమానకరమైన పనులను ఎలా చేయిస్తారని వారు అసహనం వ్యక్తం చేశారు. పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులు చెత్తను ఊడ్పించే పనులను నేర్పిస్తారా అంటూ పాఠశాల యాజమాన్యంపై దూషణలకు దిగారు. 

యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి..

నిబంధనలను ఉల్లంఘించి విద్యార్థుల చేత చెత్తను ఊడ్పించిన దుబ్బ తండ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు యాకూబ్ రెడ్డి పై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు కోరుతున్నారు. తమ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలని ఆ పాఠశాలకు పంపితే, స్కూల్ యాజమాన్యం తమ పిల్లల చేత అవమానకరమైన పనులను చేయిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల చేత పనులు చేయించిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించి ఇలాంటి సంఘటనలు ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్లలో జరగకుండా చూడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. అయితే పాఠశాల ప్రధానోపాధ్యాయులు స్వయంగా దగ్గరుండి విద్యార్థుల చేత ఈ పనులు చేయించడం గమనార్హం. ఇందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది.

Read More సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన బోనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము : రాములు నాయక్, ఎంఈఓ తొర్రూరు

Read More  ఘనంగా క్రిస్మస్ గాస్పల్ వేడుక

తొర్రూరు దుబ్బ తండ ప్రభుత్వ పాఠశాలలో టీచర్ యాకూబ్ రెడ్డి విద్యార్థులతో పనులు చేయించారని మా దృష్టికి రాలేదు. ఒకవేళ విద్యార్థులతో పనులు చేయించారని నిజమైతే తప్పకుండా చర్యలు తీసుకుంటాం.

 

Views: 203
Tags:

Related Posts

Post Comment

Comment List