పచ్చిరొట్ట విత్తనాలను పక్కదారి.. నలుగురు వ్యవసాయ అధికారులు సస్పెండ్

ఉత్తర్వులు జారీ చేసిన వ్యవసాయ కమిషనర్ గోపి

పచ్చిరొట్ట విత్తనాలను పక్కదారి.. నలుగురు వ్యవసాయ అధికారులు సస్పెండ్

పచ్చిరొట్ట విత్తనాలను పక్కదారి.. నలుగురు వ్యవసాయ అధికారులు సస్పెండ్
ఉత్తర్వులు జారీ చేసిన వ్యవసాయ కమిషనర్ గోపి

పచ్చిరొట్ట విత్తనాలను బ్లాక్ మార్కెటింగ్కు పాల్పడిన నలుగురుIMG-20240608-WA0055 వ్యవసాయ అధికారు లను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ గోపి నిన్న సాయంత్రం ఉత్తర్వులను జారీ చేశారు. మహబూబాబాద్ జిల్లా తొర్రురు మండల వ్యవసాయ అధికారి కుమాతో పాటు మరో ముగ్గురు వ్యవసాయ విస్తరణ అధికారులను (ఏ.ఈ.ఓ) సస్పెండ్ చేశారు. రైతు వ్యతిరేక చర్యలకు గానీ, పంట విత్తనాలను బ్లాక్ మార్కెటింగ్ చేసిన, కల్తీ విత్తనాలను అమ్మే ఎంత పెద్ద వారినైనా వదల వద్దని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో తొర్రురు మండలం లో పచ్చి రొట్ట విత్తనాలను బ్లాక్ మార్కెట్ ద్వారా ఇతర రాష్ట్రాలకు తరలింపుకు కారణమైన తొర్రురు మండలం వ్యవసాయాధికారి కె. సోమకుమార్ యాదవ్, తొర్రురు క్లస్టర్ గ్రేడ్ -2 ఏ.ఈ.ఓ. ఎం.జమున, అమ్మాపురం క్లస్టర్ ఏఈవో అజ్మీరా దీపిక, హరిపిరాల ఏఈవో సి. హెచ్. అరవింద్ లను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ గోపి ఉత్తర్వులు జారీచేశారు.
తొర్రురు మండలంలో పచ్చి రొట్ట విత్తనాలు అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడుతున్నారని వచ్చిన వార్తలపై విచారించాల్సిందిగా మరిపెడ మండలం అసిస్టెంట్ విచారణాధికారిగా వ్యవసాయ డైరెక్టర్ ను కమిషనర్ నియమించారు. దీంతో, విచారణ చేసిన మరిపెడ ఏ.ఈ. తొర్రురు మండలంలో పచ్చిరొట్ట విత్తనాల పంపిణీలో పెద్ద ఎత్తున అవకతవకలున్నాయని సమర్పించారు. నివేదిక ప్రధానంగా తొర్రూర్ మండల వ్యవసాయాధికారి కె. సోమకుమార్ యాదవ్కు చెందిన ఓఎస్ఎఫ్డిఎస్ పోర్టల్ లాగిన్ ను నిబంధనలకు విరుద్ధంగా ముగ్గురు ఏఈవోలకు ఇవ్వడంతో దీనిని దుర్వినియోగ పరచిన ఆ ముగ్గురు ఏఈఓలు పచ్చిరొట్ట విత్తనాలను బ్లాక్ మార్కెట్కు తరలించారని తన నివేదికలో ఏడీపేర్కొన్నారు. దీంతో, తొర్రురు మండలం వ్యవసాయాధికారి కె. సోమకుమార్ యాదవ్, తొర్రురు క్లస్టర్ గ్రేడ్ -2 ఏ.ఈ.ఓ. ఎం. జమున, అమ్మాపురం క్లస్టర్ ఏఈవో అజ్మీరా దీపిక, హరిపిరాల ఏఈవో సి.హెచ్. అరవింద్లను సస్పెండ్ చేస్తూ వ్యవసాయ కమీషనర్ బీ.గోపి ఉత్తర్వులు జారీ చేశారు.

Views: 56
Tags:

Related Posts

Post Comment

Comment List