జూన్ 9వ తేదిన జరుగనున్న గ్రూప్ –I ప్రిలిమినరీ పరీక్షకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు.
జిల్లా వ్యాప్తంగా 12 సెంటర్లలో పరీక్ష రాయనున్న 4412 మంది అభ్యర్ధులు
గ్రూప్ –I ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు* *జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్,ఐ.పి.ఎస్
*జూన్ 9వ తేదిన జరుగనున్న గ్రూప్ –I ప్రిలిమినరీ పరీక్షకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు..*
*జిల్లా వ్యాప్తంగా 12 సెంటర్లలో పరీక్ష రాయనున్న 4412 మంది అభ్యర్ధులు..*
బయోమెట్రిక్ సిస్టంతో పూర్తి పారదర్శకంగా పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది,
ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించే మోసగాళ్లను ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దు,
*గ్రూప్ –I ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు*
*జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్,ఐ.పి.ఎస్ గారు*
ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్,ఐ.పి.ఎస్ గారు మాట్లాడుతూ...తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టి.జి.పి.యస్.సి.) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్రూప్ –I ప్రిలిమినరీ పరీక్షకు పోలీసు శాఖ తరపున్న అన్నిరకాల భద్రత పరమైన ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ గారు వివరించారు. జిల్లా వ్యాప్తంగా 12 సెంటర్లలో మొత్తం 4412 మంది అభ్యర్ధులు పరీక్ష రాయనున్నారని, పరీక్షకు వచ్చే అభ్యర్ధులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్నీ సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అత్యవసర సేవలకు గాను ప్రతి పరీక్ష కేంద్రం వద్ద మెడికల్ సిబ్బంది ఉంటారని, రెండు, మూడు సెంటర్లకు ఒక అంబులెన్స్ అందుబాటులో ఉంటుందని అన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుదని, ఎవ్వరూ కూడా పరీక్ష కేంద్రం పరిసరాలలో తిరగటానికి విలులేదన్నారు. ఎగ్జామ్స్ సెంటర్ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి జిరాక్స్ షాపులు తెరిచి ఉంచరాదని షాపు యజమానులకు సూచనలు చేశామన్నారు. గ్రూప్–I ఎగ్జామ్ రాసే అభ్యర్ధులకు అసౌకర్యం కలుగకుండా టి.జి.ఆర్టీసీ డిపార్ట్మెంట్ వారు ప్రతి సెంటర్ కు స్పెషల్ బస్సులు నడపడం జరుగుతుందని అన్నారు. బయోమెట్రిక్ విధానం ద్వారా అటెండెన్స్ తీసుకోవడం జరుగుతుందని, అభ్యర్ధులు బయోమెట్రిక్, వెరీఫికేషన్ సిబ్బందికి సహకరించవలసిందిగా కోరారు.
*అభ్యర్ధులకు సూచనలు:-*
👉 పరీక్ష రోజున ఉదయం 9 గంటల నుండి అభ్యర్థులను ఎగ్జామ్ హాల్ లోనికి అనుమతి ఇస్తారని, 10 గంటలకు ఎగ్జామ్ సెంటర్ గెట్ మూసివేయడం జరుగుతుందని, 10 గంటల తర్వాత ఒక సెకండ్ ఆలస్యంగా వచ్చిన ఎవ్వరిని లోపలికి అనుమతించడం జరగదు.
👉 ఎగ్జామ్ కు వచ్చిన అభ్యర్థులు హాల్ టికెట్ లో ఉన్న నియమ నిబంధనలు తప్పకుండా పాటించాలన్నారు. అభ్యర్ధులు హాల్ టికెట్ తో పాటు ఒక కలర్ ఫోటో, ఒరిజినల్ ఆధార్ కార్డు/ డ్రైవింగ్ లైసెన్స్/ఉద్యోగి గుర్తింపు కార్డ్/ఓటర్ గుర్తింపు కార్డ్ ఏదైనా ఒకటి తప్పనిసరిగా తీసుకొని రావాల్సి ఉంటుందని అన్నారు.
👉 హాల్ టికెట్ పై ఒక ప్రస్తుత పాస్ ఫోటో అతికించాలి, అలాగే హాల్ టికెట్ పై ఫోటో సరిగ్గా కనిపించకపోయినట్లైతే 3-కలర్ ఫోటోలు తీసుకొని, హాల్ టికెట్ పై గెజిటెడ్ అధికారి సంతకం చేయించుకొని రావలసి ఉంటుంది.
👉 అభ్యర్ధులు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాన్ని ముందస్తుగా చూకున్నట్లైతే, పరీక్ష రోజు పరీక్ష కేంద్రానికి సులువుగా చేరుకోవచ్చు
👉 ఎగ్జామ్స్ హాల్ లోనికి మొబైల్ ఫోన్స్, స్మార్ట్ వాచ్,అనాలాగ్ వాచ్, కాలిక్యులేటర్స్, వైట్ పేపర్స్, పెన్ డ్రైవ్స్, టాబ్లెట్స్, షూస్, హియరింగ్ సొల్యూషన్స్ సంబంధించిన గాడ్జెట్స్ అనుమతించడం జరగదన్నారు.
👉 ఎగ్జామ్ పూర్తి అయిన తర్వాత ఒంటిగంట వరకు ఎవ్వరిని బయటకు పంపడం జరగదని, అభ్యర్థులు ఎగ్జామ్ రాసిన తర్వాత ప్రశ్నాపత్రం తమతో పాటు తీసుకు వెళ్ళడానికి వీలుగా ఉంటుంది అన్నారు.
👉 అభ్యర్థులు ఎవరైనా మాల్ ప్రాక్టీస్, మాస్ కాపింగ్ చేసినట్లు తేలితే చట్టరిత్య కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.
PRO to SP Mahabubabad
Comment List