పట్టభద్రుల ఓటు....... పట్టుకోండి 500 నోటు

పట్టభద్రుల ఓటు....... పట్టుకోండి 500 నోటు

మేధావులను చట్టసభల్లోకి పంపించాలని మేధావులు వినియోగించే ఓటు ధర రూ. 500 తో ముగుస్తుంది. ఎమ్మెల్సీ ఓట్ల సందర్భంగా తోరూర్ మండలం లో ఓట్ల రేట్లు రూ.500 కు ఫిక్స్ అయ్యాయి. దీంతో అధికార ప్రతిపక్ష నాయకులు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఎలాగైనా ఓట్లు సాధించాలనే లక్ష్యంతో అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు ఓటుకు రూ.5 వందల చొప్పున పంపిణీ చేశారు. పోలింగ్ కేంద్రాలకు సమీపంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, దుబ్బ తండా సమీపంలో బీఆర్ఎస్ నాయకులు సోమవారం ఉదయం నుంచి పోలింగ్ ముగిసేంత వరకు గ్రాడ్యుయేట్ ఓటర్లకు యథేచ్ఛగా డబ్బులు పంపిణీ చేశారు. పోల్ చిట్టీలతో డబ్బుల కోసం ఓటర్ల బారులు తీరారు. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మేధావులుగా చెప్పుకునే మేధావి వర్గాలు నోటు తీసుకున్న తర్వాతే ఓటుకు వెళ్లడం గమనార్హం. బహిర్గతంగా ఇంత జరుగుతున్న ఎన్నికల అధికారులు, పోలీసు యంత్రాంగం చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇదంతా చూసే జనం దిగ్బ్రాంతి చెందుతున్నారు.IMG-20240527-WA0110

Views: 195
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

ఐదు కేజీల కణితిని తొలగించిన ప్రభుత్వ వైద్యులు  ఐదు కేజీల కణితిని తొలగించిన ప్రభుత్వ వైద్యులు 
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా నరేష్)జనవరి16: భద్రాద్రి కొత్తగూడెంలోని పాత కొత్తగూడెంకి  చెందిన కృష్ణవేణి 35 సంవత్సరాలు అనే మహిళ గత ఐదు సంవత్సరాల నుంచి కడుపులో నొప్పితో...
సంక్రాంతి శుభాకాంక్షలు..
సంక్రాంతి మన దేశంలో జరుపుకునే పెద్ద పండుగ..
ఏడుగురు పేకాటరాయిలు అరెస్ట్..
పదవి విరమణ చేసిన సైనికుడు...
బర్త్ డే ట్రీ తెలంగాణ
నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇచ్చి నిర్మాణం చేపట్టాలి - సిపిఐ డిమాండ్..!