ఐదు కేజీల కణితిని తొలగించిన ప్రభుత్వ వైద్యులు 

కార్పొరేట్ వైద్యానికి దీటుగా ప్రభుత్వ వైద్యుల సేవలు

On
ఐదు కేజీల కణితిని తొలగించిన ప్రభుత్వ వైద్యులు 

భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా నరేష్)జనవరి16: భద్రాద్రి కొత్తగూడెంలోని పాత కొత్తగూడెంకి  చెందిన కృష్ణవేణి 35 సంవత్సరాలు అనే మహిళ గత ఐదు సంవత్సరాల నుంచి కడుపులో నొప్పితో బాధపడుతూ, నొప్పి వచ్చినప్పుడల్లా  అందుబాటులోఉన్న ఆర్ఎంపి వైద్యుల వద్ద చూయించుకొని, మందులు వాడుతూ ఉంటుంది. గత నాలుగు రోజుల క్రితం నొప్పి భరించలేక కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలొని వైద్యుల వద్దకు రాగా , వారు వైద్య పరీక్షలు నిర్వహించగా అల్ట్రా సౌండ్ స్కానింగ్ ద్వారా కడుపులో కణితి ఉన్నదాని వైద్యులు గుర్తించారు. ఆ కణితి ఐదు కేజీల బరువు ఉండగా వైద్యులకు ఆపరేషన్ అతికిష్టమైన కూడా గురువారం  సర్వజన ఆస్పత్రి వైద్యులు ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశారు. ఈ శాస్త్ర చికిత్సలో డాక్టర్ నవదీప్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జనరల్ సర్జరీ, డాక్టర్ ప్రవీణ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అనస్థీషియా, నర్సింగ్ ఆఫీసర్స్ వేద, రత్న, ఓటి సిబ్బంది హేమ, ఆది, కోటి ,అనిల్ పాల్గొన్నారు.

Views: 303
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఐదు కేజీల కణితిని తొలగించిన ప్రభుత్వ వైద్యులు  ఐదు కేజీల కణితిని తొలగించిన ప్రభుత్వ వైద్యులు 
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా నరేష్)జనవరి16: భద్రాద్రి కొత్తగూడెంలోని పాత కొత్తగూడెంకి  చెందిన కృష్ణవేణి 35 సంవత్సరాలు అనే మహిళ గత ఐదు సంవత్సరాల నుంచి కడుపులో నొప్పితో...
సంక్రాంతి శుభాకాంక్షలు..
సంక్రాంతి మన దేశంలో జరుపుకునే పెద్ద పండుగ..
ఏడుగురు పేకాటరాయిలు అరెస్ట్..
పదవి విరమణ చేసిన సైనికుడు...
బర్త్ డే ట్రీ తెలంగాణ
నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇచ్చి నిర్మాణం చేపట్టాలి - సిపిఐ డిమాండ్..!