నా గెలుపు ముదిరాజుల అభివృద్ధి కి మలుపు

ముదిరాజుల ఆత్మీయ సమావేశంలో ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర

On
 నా గెలుపు ముదిరాజుల అభివృద్ధి కి మలుపు

ముదిరాజుల ఆత్మీయ సమావేశంలో ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర

 

👉తనను  గెలిపించి, పార్లమెంట్ కు పంపిస్తే  ముదిరాజుల
అభివృద్ధి కి కృషి చేస్తానని బీఆర్ ఎస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు స్పష్టం చేశారు.
ఖమ్మంలోని కోణార్క్ హోటల్ లో  కార్పొరేటర్ దోరేపల్లి శ్వేత ఆధ్వర్యంలో   ముదిరాజులతో నిర్వహించిన   ఆత్మీయ సమ్మేళనం లో  నామ నాగేశ్వరరావు గారు పాల్గొని మాట్లాడారు. తనకు ముదిరాజులతో బీసీ సోదరులతో మంచి అనుబంధం ఉందని చెప్పారు. తాను గెలిచిన తర్వాత వారి సమస్యలపై పార్లమెంట్ లో ప్రస్తావిస్తానని చెప్పారు. కేసీఆర్ బీసీ ల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని, జిల్లాకు చెందిన బీసీ వద్దిరాజు రవిచంద్రను   రెండో సారి  రాజ్యసభకు పంపించిన ఘనత కేసీఆర్ ది అన్నారు.  ఇంకా ఈ సమావేశంలో 
  రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర , ఎమ్మెల్సీ తాతా మధు , ముదిరాజ్ సంఘం నాయకులు డాక్టర్ కిషోర్ బాబు, పిట్టల నాగేశ్వరరావు, ఇతర  ప్రముఖులు ,  కులం నుంచి   పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Views: 21
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List