సిపిఐయు పార్టీ ఆధ్వర్యంలో మేడే వేడుకలు
ఘనంగా నిర్వహిస్తున్న కార్మికులు
కార్మికుల హక్కులను కాపాడడమే సిపిఐయు లక్ష్యం
మే డే రోజునఎం సిపిఐ యూ జెండా ఆవిష్కరణ.
(న్యూస్ ఇండియా రిపోర్టర్ వెంకటేష్ గూడూరు మహబూబాబాద్)
కార్మికుల దినోత్సవం 138వ మే డే సందర్భంగా గూడూరు మండల కేంద్రంలో భారత మార్క్ స్ట్ కమ్యూనిస్టు పార్టీ ఎం సిపిఐ యు ఆధ్వర్యంలో ఘనంగా మేడే జరుపుకున్నారు గూడూరు మండల కేంద్రంలో బస్టాండ్ సెంటర్ శివాలయం వీధి చంద్ర గూడెం మచ్చర్ల ఏపూరు సీతానగరం గ్రామాలలో ఎం సిపిఐ యూ జెండాలు ఆవిష్కరించారు అనంతరం జరిగిన కార్యక్రమంలో నూకల ఉపేందర్ ఎం సి పి ఐ యు పార్టీ మహబూబాద్ జిల్లా సహాయ కార్యదర్శి మాట్లాడుతూ వందల సంవత్సరాలుగా ప్రపంచ శ్రామిక ప్రజలు చిందించిన నెత్తుటి త్యాగాల గుర్తుగా అరుణ పతాకం రెపరెపలతో ప్రపంచవ్యాప్తంగా సభలు ప్రదర్శనలతో మేడే వచ్చింది సకల దేశాల జాతుల మతాల కులాల కార్మికులంతా ఒకటేనని ఈ ప్రపంచమే మనదని చాటిచెప్పిన కార్మిక వర్గ అంతర్జాతీయ దినమే మేడే అని అన్నారు శ్రామిక ప్రజల దోపిడీకి అణిచివేతకు మానవ సమాజం ఎదుర్కొంటున్న సకల ఆర్థిక రాజకీయ సాంస్కృతిక సమస్యలకు మూల కారణంగా ఉన్న పెట్టుబడిదారీ వ్యవస్థను నిర్మూలించి సోషలిస్టు సమాజ నిర్మాణానికి కార్మిక వర్గం సంసిద్ధం కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఆయా ప్రాంతాలలో బందెల వీరస్వామి ఈసం రామయ్య కటకం బుచ్చిరామయ్య గుండ గాని సత్తయ్య తాడెం నరసయ్య జండాలు ఎగర వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు బండారి సత్యం నాగలి రాములు అరకాల స్వామి డి రంజిత్ బి శ్రీకాంత్ కే రంజిత్ వెంకన్న రాజు తదితర కార్యకర్తలు పాల్గొన్నారు
Comment List