గుడుంబా స్థావరాలపై విస్తృతస్థాయి దాడులు
దాడులలో పాల్గొన్న ఎన్నికల వ్యయ పరిశీలకులు ...
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ పోలీసులు విస్తృతస్థాయిలో దాడులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ ఎక్సైజ్ పరిధిలోని వివిధ మండలాలలో విస్తృతస్థాయిలో దాడులు నిర్వహించారు. ఈ దాడులలో పలువురుపై కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకోవడం జరిగిందని వరంగల్ అసిస్టెంట్ కమిషనర్ నాగేందర్ రావు తెలిపారు. బుధవారం తొరూర్ ఎక్సైజ్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ నాగేందర్ రావు మాట్లాడుతూ...ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి ఆదేశాల మేరకు డిప్యూటీ కమిషనర్ అంజన్ రావు సారాధ్యంలో మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ ఎక్సైజ్ స్టేషన్ , స్పెషల్ ఆఫీసర్ ఆర్ ప్రవీణ్ ఆధ్వర్యంలో ఎక్సైజ్ పరిధిలోని నాటుసారాయి నిర్మూలనకు విస్తృత దాడులు నిర్వహించటం అసిస్టెంట్ కమిషనర్ నాగేందర్ రావు అన్నారు. అదేవిధంగా వరంగల్ పార్లమెంట్ ఎన్నికల వ్వయ పరిశీలకులు ఎ.దిలీబన్,(ఐఆర్ఎస్)తొర్రూరు ఎక్సైజ్ స్టేషన్ ను అకస్మిక తనిఖీ చేశారు.తదుపరి కార్యాలయంలో తొర్రూర్ ప్రొహిబిషన్ రికార్డులను తనిఖీ చేసి ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు నమోదు చేసిన కేసుల వివరాలు,స్వాధీనం చేసుకున్న మద్యం మరియు నాటుసారాయి,వాటి విలువలను అడిగి తెలుసుకున్నారు. తదుపరి ఎక్సైజ్ అధికారులు, సిబ్బందితో కలసి తొర్రూరు మండల పరిధిలోని అమర్ సింగ్ తండా, భీముడు తండా, కాశగూడెం, హంపరాల తండాలలో జరిపిన దాడులలో నాటు సారాయిని పట్టుకున్నారు.ఈ దాడులలో తయారు చేస్తున్న (4) వ్యక్తులను అదుప్పులకి తీసుకుని,వారి నుంచి 40 లీటర్ల నాటుసారాయి స్వాధీనం చేసుకుని, నాటుసారాయి తయారీకి ఉపయోగించే (6800) లీటర్ల బెల్లం/పంచదార పానకాన్ని సంఘటన స్థలంలోనే ఈ ధ్వంసం చేయటం జరిగిందని తెలిపారు.తొర్రూరు స్టేషన్ నందు జరిగినటువంటి కేసుల నమోదు, రోజువారీ కార్యక్రమాలపై సంతృప్తి వ్యక్తం చేసి, ఎన్నికలు ముగిసే వరకు ఎక్సైజ్ నేరాలను నియంత్రించాలని మద్యం యొక్క నిల్వలను రోజువారీగా పరిశీలించాలని "సూచించారు. అదేవిధంగా అబ్కారీ పోలీసులు చేసిన దాడులకు ఎన్నికల వ్యయ పరిశీలకులు వారిని అభినందించారు.ఎన్నికల వ్యయ పరిశీలకులతో పాటు, అసిస్టెంట్ కమిషనర్ ఏ.నాగేందర్ రావు, వరంగల్ జోక్ అసిస్టెంట్ కమీషనర్, డి.శ్రీనివాస్ రెడ్డి, ఎన్ఫోర్ట్ మెంట్ ఎఇఎస్,అర్. ప్రవీచ్ ఎఇఎస్, నాగేశ్వర్రావు సిఐ ఎన్ఫోర్స్ మెంట్,ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గోన్నారు.
Comment List