గుడుంబా తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్*
తొర్రూరు ఎక్సైజ్ ఎస్సై తిరుపతి
*గుడుంబా తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్*
గుడుంబా తరలిస్తుండగా ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు తొర్రూరు ఎక్సైజ్ ఎస్సై తిరుపతి తెలిపారు. ఎస్సై తిరుపతి మాట్లాడుతూ శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో తొర్రూర్ మండలం దుబ్బ తండ గ్రామంలో ధరావత్ యాకూబ్ అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై నాటు సారాయి తరలిస్తుండగా విశ్వనీయ సమాచారం మేరకు అతన్ని పట్టుకొని అరెస్టు చేయడం జరిగిందని ఎస్సై తెలిపారు. ధరావత్ యాకుభ్ ను విచారించగా తాను తయారుచేసి నాట సారాయిని సరాఫర చేస్తాడని తానే స్వయంగా ఒప్పుకున్నాడు.అదేవిధంగా అతని దగ్గర నుండి ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకొని,అతడు ఎవరెవరికి సరాఫర చేస్తాడో వారిని కూడా అదుపులోకి తీసుకుంటామని ఎస్సై తిరుపతి తెలిపారు. సరఫరా చేసిన వారిలో గద్దెల సాయిలు అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. ఈ దాడులలో ఎస్సై తిరుపతి,కానిస్టేబుల్స్ శ్రీనివాస్ ప్రభాకర్,సత్యప్రసాద్ పాల్గొన్నారు.
Comment List