ఏమండోయ్ నేను గుర్తున్నానా

On

ఏమండోయ్ నమస్కారం నా పేరు తెలుగు మీకు నేను గుర్తున్నానా ఉండే ఉంటాలెండి నేను మధ్య ద్రావిడ భాష నుండి పుట్టాను నన్ను ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని అజంత భాష అని కూడ పిలుచుకుంటారు దేశ భాషలందు తెలుగు లెస్స అని పొగిడేవారు ప్రపంచంలో నా స్థానం పదమూడు మన దేశంలో నేను రెండవదానిని కాని నా రాష్ట్రంలో నా స్థానం అధమం నా ఉనికి నా అస్థిత్వం నేను కొల్పోతున్నాను నేనా అంతరించి […]

ఏమండోయ్
నమస్కారం
నా పేరు తెలుగు
మీకు నేను గుర్తున్నానా
ఉండే ఉంటాలెండి
నేను మధ్య ద్రావిడ భాష నుండి పుట్టాను
నన్ను ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని
అజంత భాష అని కూడ పిలుచుకుంటారు
దేశ భాషలందు తెలుగు లెస్స అని పొగిడేవారు
ప్రపంచంలో నా స్థానం పదమూడు
మన దేశంలో నేను రెండవదానిని
కాని నా రాష్ట్రంలో నా స్థానం అధమం
నా ఉనికి నా అస్థిత్వం
నేను కొల్పోతున్నాను
నేనా అంతరించి పోతున్నాను
నేను మీ మాతృమూర్తిని
నేను మీ స్నేహితురాలిని
నేను మీ గురువుని
నేను మీ భవిష్యత్తుని
నేను మీ మార్గదర్శిని
నేను మీ అస్థిత్వాన్ని
నేను మీ శ్వాసని
నేనే మీ ధ్యాసని
మిత్రమా
నన్ను కాపాడు
నా జాతి అంతరించి పోకుండా చూడు
సభలు సమావేశాల్లో నన్ను చులకన చేయకు
నన్ను పలకరించడానికి సిగ్గు పడకు
ఒక్కసారి
నన్ను దరి చేరు
నేనేంటో
నా ఆత్మీయత ఏంటోనీకు
అవగతమౌను
నిన్ను ఉన్నత వ్యక్తి గా
సమాజంలో గౌరవ ప్రదమైన వ్యక్తి గా
మార్చగలను
రాబోయే భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దగలను
నన్ను మర్చిపోవు కదూ
నన్ను పుస్తకంలో
జ్ఞాపకంగా మార్చకు మిత్రమా
నన్నుఆదరించు
నన్ను ప్రేమించు
నాతో కలసి జీవించు
నన్ను నా గౌరవాన్ని కాపాడుతావు కదూ

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List