మహిళల సంక్షేమానికి, మహిళల గౌరవానికి పోలీస్ శాఖ అత్యధిక ప్రాధాన్యతనిస్తుంది
---- ఎస్పి శ్రీ సుధీర్ రాంనాధ్ కేకన్ ips*
మహిళల సంక్షేమానికి, మహిళల గౌరవానికి పోలీస్ శాఖ అత్యధిక ప్రాధాన్యతనిస్తుంది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు --- ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ IPS
*ఆకతాయిల ఆగడాలపై ప్రత్యేక నిఘా .....*
*మహిళల భద్రతకు ప్రతిష్టాత్మకంగా పని చేస్తున షీ టీమ్ లు*
*ఫిర్యాదుల స్వీకరణకు ప్రజలకు అందుబాటులో సాంకేతిక పరిజ్ఞానం*
*QR కోడ్ ద్వారా ఉన్న చోటు నుండే వేధింపులపై నిమిషాల్లో ఫిర్యాదు చేయవచ్చు*
*---- ఎస్పి శ్రీ సుధీర్ రాంనాధ్ కేకన్ ips*
మహబూబాబాద్ జిల్లా పరిధిలో షీ టీమ్ బృందాలు అధికారుల పర్యవేక్షణ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా పని చేస్తున్నాయని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శ్రీ సుధీర్ రాం నాధ్ కేకన్ ips గారు తెలిపారు
కళాశాలలు, పాఠశాలల్లో చదివే విద్యార్థినులు, మహిళలకు భద్రత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షీ టీమ్ లు ఆకతాయిలు ఆగడాలకు అడ్డుకట్టు వెస్తునాయని ఆయన అన్నారు.
- రద్దీ ప్రాంతాలు, బస్టాండ్లు, విద్యాసంస్థల , దేవాలయాలుపరిసర ప్రాంతాల్లో షీ టీమ్ పోలీసులు మఫ్టీలో ఉంటూ ఆకతాయిలకు చెక్ పెడుతున్నారు.
మహబూబాబాద్,తొర్రూరు సబ్ డివిజన్ పరిధిలలో షీ టీం పోలీసులు ఆ శాఖ పనితీరుపై బస్ స్టాండ్,రైల్వే స్టేషన్,ముఖ్య కుడలులో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు.
• ప్రస్తుత తరుణంలో మహిళలు అన్ని రంగాల్లో పోటీపడి పనిచేస్తున్నారని తాము పనిచేస్తున్న రంగాల్లో ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్నారని, అలాంటి వారికి షి టీమ్స్ ఎల్లపుడు అండగా నిలుస్తూ దైర్యన్ని ఇస్తాయన్నరు.
అవగాహన కార్యక్ర మాలు పెంచడం ద్వారా మారుమూల గ్రామీణ ప్రాంత మహిళలు, విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ధైర్యంగా ముందుకు వస్తారని షీ-టీమ్ చేపడుతున్న అవగాహన కార్యక్రమాలు ప్రజల ఆదరణ పొందుతున్నాయి అన్నారు.
తమకు వచ్చిన ఫిర్యాదులను స్వీకరిస్తూ ఆకతాయిల ఆగ డాలను వీడియో రికార్డ్ చేయడంతో పాటు కొన్ని సందర్భాల్లో కేసులు సైతం నమోదు చేస్తున్నారన్నారు.
ఆకతాయిలు వెంటపడి వేధించడంతో పాటు అసభ్యకరంగా ప్రవర్తిస్తే 100, 112,తో పాటు 7901142009,8712656935వాట్సప్ నంబర్ లో సంప్రదించాలని , ఉన్నచోట నుండి ఫిర్యాదు చేయడానికి qr.tspolice.gov.in వెబ్సైట్లోకి లాగిన్ అవ్వడం ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
బస్టాండ్, పాఠశాలలు. కళాశాలలు వద్ద మహిళ లను వేధించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం
జిల్లా పరిధిలోని పోలీసు స్టేషన్ లలో మహిళల రక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు పాఠశాలలు, కళాశాలల వద్ద షీ-టీమ్ ఫోన్ నంబర్లు తెలిసేలా ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. ఆకతాయిల వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు నిర్భయంగా ముందుకు రావాలి. వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని అన్నారు.
2023 జనవరి నుండి వరకు మహబూబాబాద్ జిల్లా పరిధిలో షి టీమ్స్ వారి వివరాలు...
షి టీమ్స్ బృందం -- 1
అవగాహన కార్యక్రమాలు - 120
షి టీమ్ సభ్యులు ఇప్పటి వరకు సందర్శించిన ప్రాంతాలు ---580.
రిజిస్టర్ చేయించిన కేసులు--56.
రెడ్ హ్యాండెడ్ కేసులు-40
కౌన్సిలింగ్ చేసినవి-70.
మహబూబాబాద్ జిల్లా లో జరిగిన కొన్ని సంఘటనలను చూసినట్లయితే
* జిల్లాలోని తొర్రూరు సబ్ డివిజన్లో ఒక గ్రామంలో ఒక స్కూల్ విద్యార్థి అయిన మైనర్ బాలికను తనకు పరిచయం ఉన్న ఒక వ్యక్తి వెంటపడి వేదించగా అమ్మాయి వ్యతిరేకించడంతో అబ్బాయి తన కుటుంబ సభ్యుల పై దాడి చేయగా అట్టి వ్యక్తిపై కేసు రిజిస్టర్ చేయించడం జరిగింది. తర్వాత ఆ గ్రామంలో మరల ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండటానికి అవగాహన కార్యక్రమం ను నిర్వహించడం జరిగింది.
*జిల్లా కేంద్రంలో ఒక కాలేజీలో చదువుతున్న విద్యార్థిని తను రోజు కాలేజీకి వెళ్లి వచ్చే క్రమంలో పరిచయమైన ఆటో డ్రైవర్ తనను ట్రాప్ చేయగా అట్టి వ్యక్తిపై కేసు రిజిస్టర్ చేయించడం జరిగింది.
*జిల్లాలోని ఒక మండలంలో ఒక వివాహిత మహిళ యొక్క ఫోటోలను వారి బంధువు ఒకతను మార్ఫింగ్ చేసి తన కుటుంబ సభ్యులకు పంపి ఇబ్బంది పెట్టగా సదరు వ్యక్తిని గుర్తించి కేసు రిజిస్టర్ చేయించడం జరిగింది.
*జిల్లాలో ఒక కాలేజీ విద్యార్థి ని నీ తన దూరం బంధువు అయిన ఒక వ్యక్తి వెంటపడి కాలేజీకి వచ్చి ఇబ్బంది పెట్ట గా అట్టి వ్యక్తిపై కేసు రిజిస్టర్ చేయించడం జరిగింది.
*బస్టాండ్ ఏరియాలలో విద్యార్థినులను ఈవిటీజింగ్ చేస్తుండగా వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని కౌన్సిలింగ్ చేయడం, కొన్ని సందర్భాల్లో కేసులు చేయించడం కూడా జరిగింది.
*జిల్లా కేంద్రంలోని కొన్ని ఏరియాలలో, సినిమా థియేటర్ పరిసర ప్రాంతా లలో ఉండే యువత చెడు అలవాట్లకు ముఖ్యంగా గంజాయి మత్తుకు బానిస అవు తున్నారు. చదువుకోవాల్సిన వయసులో మైనర్లు ఈ విధంగా దొంగతనాలకు పాల్పడడం, పదార్థాలకు బానిసవ్వడం, మహిళలపై వేధింపులకు పాల్పడటానికి వెనుకాడటం లేదు. ఇటువంటి వాటి గురించి కాలేజీలు, హాస్టల్ లు , గ్రామాలలో కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.
ఈ సందర్భంగా ఎస్పీ గారు...
మహిళల రక్షణ కోసం, వారి హక్కులను కాపాడటం కోసం, మహిళల గౌరవ, ప్రతిష్టలకు పోలీస్ శాఖ అత్యధిక ప్రాధాన్యతనిస్తుంది. పోలీసు ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు, ప్రతి పోలీస్ స్టేషన్లో మహిళల సమస్యలు వినడానికి మహిళా కానిస్టేబుల్ నియామకం, పోలీస్ స్టేషన్లో మహిళలకు ప్రత్యేక మౌలిక సదుపాయాలు కల్పించడం, మహిళల రక్షణ కోసం మహిళా పోలీస్ స్టేషన్లు,ష్ టీమ్ లు, భరోసా సెంటర్ల ఏర్పాటు వంటి అనేక చర్యలను పోలీస్ శాఖ చేపడుతూ మహిళా దినోత్సవ స్ఫూర్తిని కొనసాగిస్తుందని తెలియజేసారు. బాధిత మహిళలకు అండగా ఉంటూ వారికి రక్షణ కల్పించడమే కాకుండా మహిళల సంరక్షణకు కూడా పోలీస్ శాఖ అన్ని రకాల చర్యలు చేపడుతుందని ఈ సందర్భంగా ఎస్సీ తెలియజేసారు.
Comment List