పాయకరావుపేట వైసీపీలో రోడ్డెక్కిన విభేదాలు
లోకల్ పెదపాటి అమ్మాజీకి టికెట్ ఇవ్వాలంటూ డిమాండ్
పాయకరావుపేట నియోజకవర్గం వైసీపీలో విభేదాలు రోడ్డెక్కాయి. ఎమ్మెల్యే గొల్ల బాబూరావు స్థానంలో ఇన్ ఛార్జిగా విజయనగరం జిల్లా రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులును పార్టీ అధిష్టానం నియమించింది. ఈ నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు సోమవారం ఆందోళనకు దిగారు.
ఎమ్మెల్యే టికెట్ స్థానికులకే కేటాయించాలని లోకల్ ముద్దు నాన్ లోకల్ వద్దం అంటూ ర్యాలీ చేపట్టారు. వచ్చిన వారంతా జై జగన్.. జై అమ్మాజీనాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఎస్ రాయవరం మండలం అడ్డరోడ్డు జాతీయ రహదారి కూడలి నుంచి ర్యాలీగా వచ్చి, పాత జాతీయ రహదారి కూడలి వద్ద మానవహారంగా ఏర్పడ్డారు. వీరి ఆందోళనతో రహదారిపై ఇరువైపులా పెత్త ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. బయటి నుంచి వచ్చిన వారు ఎమ్మెల్యేగా ఎన్నికై స్థానికులను పట్టించుకోవడం లేదన్నారు. ఇక్కడి పరిశ్రమలో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకపోయినా అడగడం లేదన్నారు. వారికి ముడుపులు అందుతాయని ఆరోపించారు.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List