మర్వెల్లి పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం
- హజరైన ఉపాధ్యాయులు
- విద్యార్థుల ఆత్మీయ కలయికతో విద్యార్థుల్లో చైతన్యం
- హర్షించిన ఉపాధ్యాయులు
వట్పల్లి పూర్వపు విద్యార్థుల ఆత్మీయ కళయిక శుభ పరిణామమని ప్రతి విద్యార్థి ఈలాంటి కార్యక్రమాలు చేపట్టేందుకు ఎల్లప్పుడూ ముందుండాలని ఉపాధ్యాయులు విద్యార్థులను కోరారు. ఆదివారం మండల పరిధిలోని మర్వెల్లి పాఠశాలలో 1992-93 సంవత్సరం పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం పూర్వ విద్యార్థి నజీర్ అహ్మద్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అప్పటి ప్రధానోపాధ్యాయులు అజీత్ ప్రసాద్,బస్వశేఖర్,రాంరెడ్డి, నాగిరెడ్డి, పండరయ్య తదితరులు ముఖ్య అతితులుగా హజరైయ్యారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ తమ విద్యార్థులు ఉన్నతంగా ఎదిగినప్పుడే ప్రతి గురు అనంద పడతాడాని, విద్యార్థులను ప్రయోజకులను చేసి మంచి భాటలో నడిచి సమాజంలో పేరు ప్రఖ్యాతులు గాంచినప్పుడు ఉపాధ్యాయుల ఆత్మ గౌరవం మరింత పెరుగుతుందన్నారు.అనంతరం ఉపాధ్యాయులను,విధ్యార్థులను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు రాములు,మాణిక్యం,శ్రీనివాస్, అశోక్,సుగుణ, సాయిలు,జగదీశ్వర్, గోపాల్,సంజీవులు,శివయ్య,యాదయ్య,అనిల్ కుమార్, నర్సిములు,యాదయ్య,శ్రీనివాస్ రెడ్డి, వీరారెడ్డి,విజయ్,జహంగీర్ తదితరులు పాల్గొన్నారు
Comment List