శ్రీ రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర కొత్తపేట ఆహ్వానం
పెద్దశంకరంపేట్
అయోధ్య లో శ్రీ రాముని విగ్రహ ప్రతిష్ట సందర్బంగా మెదక్, పెద్దశంకరంపేట్ మండలం కొత్తపేట గ్రామం లో ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఆధ్యాత్మిక స్వాతంత్య్రం పొందబోతున్న వేళ అయోధ్య రామ చంద్రుడి ప్రాణ ప్రతిష్ట వీక్షణకు ఆలయ ప్రాంగణం లో భారీ ఏర్పాట్లు చేశారు. LED స్క్రీన్ , పూజ కార్యక్రమం మొదలు కొని అన్నదానం వరకూ వచ్చే రామ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సకల సౌకర్యాలతో చక్కటి ఏర్పాట్లు చేశారు. గ్రామాలకు అక్షింతలు వితరణ కార్యక్రమం వితరణ మరియు ప్రాణ ప్రతిష్ట మహోత్సవం వరకు అంతా గ్రామ ప్రజలు సహకరం తో నిర్వహణ విజయవంతంగా జరుగుతుంది అని గ్రామ పెద్దలు వెల్లడించారు. ప్రధాన ఘట్టం అయిన అయోధ్య రామ చంద్రుడి ప్రాణ ప్రతిష్ట వీక్షణ మహోత్సవం కోసం మనమందరం స్వచ్ఛందంగా భక్తి శ్రద్ధలతో ఉదయం 8 గం ల నుండి రాత్రి 8 గం ల వరకు జరిగే ప్రతి రామ చంద్రుడి కార్యం లో పాల్గొని ఆ రామ చంద్రుడి కృపకు పాత్రులు అవుదామాని మట్టం జగదీశ్వర్ అన్నారు.
కార్య క్రమం వివరాలు:
ఉదయం 8 గం ల వరకు రామ మందిరం కు చేరుకుని, 8.30 ల నుండి 10.00 ల వరకు పట్టణ వీదుల గుండా శోభ యాత్ర గా మేళ తాళాలతో గ్రామ ప్రదక్షిణ
10.00 నుండి 11.00 వరకు అల్పాహారం
11.00 ల నుండి 12.00 గం ల వరకు పూజ కార్యక్రమం సామూహిక హనుమాన్ చాలీసా పారాయణము, 108 సార్లు రామ విజయ మంత్రం 'శ్రీ రామ జయ రామ జయజయ రామ ' పఠనం
12.00 గం ల నుండి 1 గం వరకు ప్రాణ ప్రతిష్ట వీక్షణ మహోత్సవం కాగానే రామ చంద్రుడి అక్షింతలతో ఆశీర్వచనం
1.30 ల నుండి అన్న దాన ప్రసాద వితరణసాయింత్రం 6 నుండి 8 గం ల వరకు ప్రతీ ఇంటా దీపోత్సవం మరియు భజన కార్యక్రమం
ఈ కార్యక్రమంలో శ్రీరామ జన్మభూమి కొత్తపేట అధ్యక్షులు గందమల్లి ప్రసాద్ మరియు మాజీ సర్పంచ్ శంకరయ్య, NCC విశ్వేశ్వర్ గౌడ్, గ్రామ పెద్దలు పరమేశ్వర్ రెడ్డి మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Comment List