గోపాలమిత్ర పెండింగ్లో వేతనాలు తక్షణమే స్పందించిన ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క
ధన్యవాదాలు తెలుపుతూ పుష్పగుచ్చం అందిస్తున్న తెలంగాణ రాష్ట్ర గోపాలమిత్ర అసోసియేషన్ అధ్యక్షుడు చెరుకు శ్రీనివాస్
న్యూస్ ఇండియా తెలుగు, జనవరి 12 (నల్లగొండ జిల్లా ప్రతినిధి బెల్లి శంకర్): గత 5 నెలల వేతనాలు పెండింగ్ లో ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి వర్యులు మాన్యా బట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్ర గోపాలమిత్ర సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షుడు చేరుకు శ్రీనివాస్ గత నెల 29 తారీఖున సెక్రటేరియట్ లో కలిసి వినతిపత్రం సమర్పించడం జరుగుతుంది. మంత్రి స్పందించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1530 మంది గోపాలమిత్రులకు త్వరగా పెండింగ్ లో వేతనాలు అందించాలి అని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణ రావు ఫైనాన్స్ శాఖ గారి ఆదేశాలు జారీచేసినందుకు గాను ప్రధాన కార్యదర్శి గారు స్పందించి పెండింగ్ లో ఉన్న వేతనాలు రిలీజ్ చేసినందుకు గాను రాష్ట్ర అధ్యక్షులు చెరుకు శ్రీనివాస్ మంత్రి కి ప్రధాన కార్యదర్శి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపి మరియు పండుగ పూట పస్తులు ఉండకుండా చూసినందుకు ధన్యవాదాలు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కెషావులు వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
Comment List