నెహ్రూ యువ కేంద్ర ఖమ్మం ఆధ్వర్యంలో జాతీయ యువ దినోత్సవం మరియు రోడ్డు భద్రతా వారోత్సవాలు
*నెహ్రూ యువ కేంద్ర ఖమ్మం ఆధ్వర్యంలో జాతీయ యువ దినోత్సవం మరియు రోడ్డు భద్రతా వారోత్సవాలు*
జిల్లా యువ అధికారి అన్వేష్ చింతల ఆదేశాల మేరకు, అకౌంట్స్ అండ్ ప్రోగ్రాం అధికారి కమరతపు భానుచందర్ ప్రోత్సాహంతో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల (బాలికలు), ఖమ్మం నందు జాతీయ యువ దినోత్సవం మరియు రోడ్డు భద్రత వారోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ట్రాఫిక్ పోలీస్ ఎస్ఐ శ్రీ టి రవికుమార్, ఎన్ఎస్ఎస్ జిల్లా కన్వీనర్ శ్రీ శ్రీనివాస రావు, సీఎంఓ శ్రీ రాజశేఖర్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఝాన్సీ మరియు నెహ్రు యువ కేంద్ర అధికారి భానుచందర్, స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల సమర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వామి వివేకానంద జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని యువత అత్యున్నత స్థానానికి ఎదగాలని, రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించి ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ, ప్రమాదాలు జరగకుండా చూసుకోవడం సగటు భారతీయ పౌరుడి బాధ్యత అని ముఖ్య అతిధులు యువతకు సందేశం ఇచ్చారు. జిల్లాస్థాయిఉపన్యాస పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కుమారి యాడ లావణ్య 'స్వామి వివేకానంద జీవితం' పై ఉపన్యాసం ఇచ్చారు. యువతని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించిన వీడియోను లైవ్ లో ముఖ్య అతిథులతో పాటు యువత కూడా వీక్షించారు. తదుపరి రోడ్డు భద్రత అవగాహన కోసం యువత ప్లక్కాడ్ లతో మరియు నినాదాలతో ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీని ట్రాఫిక్ ఎస్ఐ టి రవికుమార్ ప్రారంభించారు. ఈ ర్యాలీలో ముఖ్య అతిథులతో పాటు కోవెల శ్రీయుత అసోసియేషన్ అధ్యక్షులు కిషోర్, పువ్వాడ నగర్ జాగృతి యూత్ అసోసియేషన్ అధ్యక్షులు సయ్యద్ షారుక్ ఇమ్రాన్, ఎన్వికె వాలంటీర్లు మనస్విని, మరియు ఖమ్మం ట్రాఫిక్ సిబ్బంది మదార్, జమాల్,అనిల్, అక్రమ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించినందుకు గౌరవనీయులైన కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఝాన్సీ గారికి మరియు కళాశాల ఎన్ఎస్ఎస్ పిఓ శ్రీమతి లీలా గారికి నెహ్రూ యువ కేంద్ర ఖమ్మం ధన్యవాదాలు తెలిపింది.
Comment List