వికలాంగుల సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యం

On

వికలాంగుల సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యం 2016 ఆర్ పి డి చట్టం పటిష్టంగా అమలు చేయాలి సమ్యల పరిష్కారానికై సత్యాగ్రహ దీక్షలు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పిఆర్డీ) రాష్ట్ర ఉపాధ్యక్షులు బిట్ల గణేష్ న్యూస్ ఇండియా తెలుగు ఆగష్టు 30 (జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తాళ్ళపల్లి వెంకన్న గౌడ్): జనగామ జిల్లాలో వికలాంగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్న, వాటిని పరిష్కారం చేయటంలో జిల్లా ఉన్నతాధికారులు నిర్లక్ష్యం, వివక్ష చూపుతున్నారని, ఇప్పటికైనా అధికారులు ఉద్యోగ ధర్మం […]

వికలాంగుల సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యం

2016 ఆర్ పి డి చట్టం పటిష్టంగా అమలు చేయాలి

సమ్యల పరిష్కారానికై సత్యాగ్రహ దీక్షలు

వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పిఆర్డీ) రాష్ట్ర ఉపాధ్యక్షులు బిట్ల గణేష్
న్యూస్ ఇండియా తెలుగు ఆగష్టు 30 (జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తాళ్ళపల్లి వెంకన్న గౌడ్):
జనగామ జిల్లాలో వికలాంగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్న, వాటిని పరిష్కారం చేయటంలో జిల్లా ఉన్నతాధికారులు నిర్లక్ష్యం, వివక్ష చూపుతున్నారని, ఇప్పటికైనా అధికారులు ఉద్యోగ ధర్మం పాటిస్తూ వికలాంగులకు ఆత్మగౌరం, సమానావకాశాలు కల్పించే 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టంను జిల్లాలో అన్ని శాఖలలో పటిష్టంగా అమలు జరిగే విధంగా చర్యలు చేపట్టాలని, అలాగే జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయన యాత్రలు చేపట్టి ఈ యాత్రల సందర్బంగా వచ్చిన సమస్యల పరిష్కారంకై జిల్లా కేంద్రంలో గాంధేయ మార్గంలో సత్యాగ్రహ దీక్షలు చేపట్టుతామని త్వరలో వివరాలను ప్రకటిస్తామని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పీఆర్డీ) రాష్ట్ర ఉపాధ్యక్షులు బిట్ల గణేష్ తెలిపారు. సోమవారం రోజున ఎన్పిఆర్డీ జనగామ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సంఘం జిల్లా అధ్యక్షులు పాముకుంట్ల చందు అధ్యక్షతన జిల్లాలో వికలాంగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలతో కూడిన వినతిపత్రం జిల్లా జాయింట్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ గారికి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బిట్ల గణేష్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. అనంతరం బిట్ల గణేష్ మాట్లాడుతూ ఇతర జిల్లాల్లో మాదిరిగా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ డే తో సంబంధం లేకుండా వారంలో ఒకరోజు వికలాంగులకు ప్రత్యేక గ్రీవెన్స్ డే నిర్వహించాలని, అప్పుడే వికలాంగుల సమస్యలు గుర్తించి ఆ సమస్యల పరిష్కారానికి సులభతరం అవుతుందని తెలిపారు. 2016 RPD చట్టం అమలులోకి వచ్చి 6 ఎండ్లు అవుతుందని, ఇప్పటికీ చట్టంలో పేర్కొన్న అనేక అంశాలను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. సెక్షన్ 24 ప్రకారం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో 25% అదనంగా చెల్లించాలని చట్టంలో ఉన్న, కళ్యాణ లక్ష్మీ పథకం మినహా మిగతా పథకాలలో ఎందుకు అమలు చేయలేదని అన్నారు. ఇప్పటికి జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాల్లో ర్యాంపులు లేక వికలాంగులు అర్జీలు ఇవ్వలేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సెక్షన్ 21ప్రకారం ప్రభుత్వ కార్యాలయాలలో ర్యాంపులు ఎందుకు నిర్మించడం లేదని అన్నారు. జిల్లా స్థాయిల్లో వికలాంగుల కో-ఆర్డినేషన్ కమిటీ తూతూమంత్రంగా ఏర్పాటు చేసి ఇప్పటివరకు సమావేశాలు ఎందుకు జరపడం లేదని అన్నారు. వికలాంగుల సమస్యలపై ప్రతి 3 నెలలకు ఒక్కసారి సమీక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చట్టం గుర్తించిన 21రకాల వైకల్యాలకు ధృవీకరణ పత్రాలు ఇవ్వడం లేదని, తక్షణమే 21రకాలకు సర్టిఫికేట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి జిల్లా కేంద్రంలో వికలాంగుల భవనం నిర్మించాలని కోరారు. జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న బ్యాక్ లాక్ పోస్టులను గుర్తించి వెంటనే భర్తీ చేయడానికి కృషి చేయాలని కోరారు. జిల్లా కేంద్రంలో వికలాంగులకు ఇండ్ల కోసం స్థలాలు కేటాయించి మోడల్ కాలనీ ఏర్పాటు చేయాలని అన్నారు. జిల్లాలో వికలాంగుల బాలుర – బాలికల వసతి కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో అధ్యయన యాత్రలు చేపట్టి ఈ యాత్రల సందర్బంగా వచ్చిన సమస్యలను గుర్తించి వాటి పరిష్కారంకై గాంధేయ మార్గంలో జిల్లా కేంద్రంలో సత్యాగ్రహ దీక్షలు చేపట్టుతామని దీనికి సంబంధించిన వివరాలను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బండవరం శ్రీదేవి, రావుల శ్రీనివాస్, ఎండి. గౌసియా, ఎండి రజియా, సబీనా బేగం, రాధిక, గనబోయిన రాజు, ఆమంచ అఖిల, నిఖిల, ఎండి. యాకుబ్ పాష, మధు, యాకయ్య తదితరులు పాల్గొన్నారు.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List