పెదపాటి అమ్మాజీదే సీటు.. క్లీన్ ఇమేజ్ కే జగన్ ఓటు
పాయకరావుపేట బరిలో ఏపీ ఎస్సీ మాల కార్పొరేషన్ చైర్ పర్సన్
ఏపీ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత నేపథ్యంలో క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుల కోసం వైసీపీ అధిష్టానం వెతుకుతోంది. దీంతో పాయకరావుపేట అసెంబ్లీ బరిలో కొత్త అభ్యర్ధిని నిలుపబోతున్నారు. పార్టీ సర్వేల్లో పెదపాటి అమ్మాజీకే మొగ్గు ఉండటంతో స్థానికంగానూ సానుకూలత వ్యక్తమవుతోంది.
ఏపీలో ఎన్నికలు దూసుకువస్తుండటంతో వైసీపీ, టీడీపీ వ్యూహ ప్రతి వ్యూహాల్లో పూర్తిగా నిమగ్నమైపోయాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉండటంతో వారి ప్లేస్ ల్లో క్లీన్ ఇమేజ్ ఉన్న నేతల్ని వెతికేపనిలో వైసీపీ ఉంది. ఉత్తరాంధ్రలోని అనకాపల్లి జిల్లాలో ఎస్సీ నియోజకవర్గమైన పాయకరావుపేటలో టీడీపీ వంగలపూడి అనితను నిలిపేందుకు సిద్ధమవుతుండటంతో ఆ ప్లేస్ లో క్లీన్ ఇమేజ్ ఉన్న బలమైన మహిళా అభ్యర్ధిని నిలుపబోతోంది. ఏపీ ఎష్సీ మాల కార్పొరేషన్ చైర్ పర్సన్ పెదపాటి అమ్మాజీని బరిలోకి దింపుతోంది.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List