కంగ్టి లో జియో నెట్ వర్క్ ప్రొబ్లామ్
సంగారెడ్డి జిల్లా మండల కేంద్రమైన కంగ్టి గత కొన్ని రోజులుగా జియోకు చెందిన చాలా మంది కస్టమర్లు నెట్వర్క్ సమస్యలను నివేదించారు. సిగ్నల్ నాణ్యత సరిగా లేకపోవడం, ఇంటర్నెట్ వేగం మందగించడం, తరచూ కాల్ డ్రాప్స్ వస్తున్నాయని వారు ఫిర్యాదు చేశారు. ఈ సమస్యను గుర్తించిన జియో వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపింది. అయినా ఎంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నా పేరు అనిల్ జియో సిమ్ వాడుతున్న వినియోగదారుని
జియో నెట్ వర్క్ తో నేను చాలా విసుగు చెందాను.రాత్రి సమయంలో నెట్ వర్క్ తరచూ నెమ్మదిగా ఉంటుంది ఫోన్ మాట్లాడాలన తరచుగా డిస్కనెక్ట్ అవుతుంది. నేను అంతరాయం లేకుండా వీడియోలు చూడలేను,ఆటలు లేకపోతున్న నా స్నేహితులతో చాట్ చేయలేకపోతున్నాను రోజు నెట్ బ్యాలెన్స్ వృధా అయిపోతుంది జియో సిమ్ తో చాలా ఇబ్బంది పడుతున్నాను పలుమార్లు కస్టమర్ కేర్ కి ఫిర్యాదు చేసిన వారు ఇప్పటివరకు తగు చర్యలు తీసుకోలేదు ఇప్పటికైనా స్పందించి తగు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను
Comment List