పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధి చూసి ఎన్నికల ప్రచారంలోని గ్రామ గ్రామాల్లో వివిధ పార్టీల నుండి టిఆర్ఎస్ లోకి చేరిక

పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధి చూసి ఎన్నికల ప్రచారంలోని గ్రామ గ్రామాల్లో వివిధ పార్టీల నుండి టిఆర్ఎస్ లోకి చేరిక


వరంగల్ జిల్లా,
పాలకుర్తి నియోజకవర్గం;

ఈరోజు (20-11-2023) సోమవారం పాలకుర్తి నియోజకవర్గం లోని రాయపర్తి మండల గ్రామాలైన బందనపల్లి, కొత్తూరు,పెరికేడు,కొండాపురం, ఊకల్ ,గట్టికల్, జగన్నాధపల్లి, సన్నూరు, శివరాంపురం మరియు మైలారం గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన రాష్ట్ర  పంచాయతీ రాజ్,  గ్రామీణాభివృద్ధి,గ్రామీణ నీటి సరఫరా పారుదల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు..

*బోనం,బతుకమ్మలను ఎత్తిన ఎర్రబెల్లి, మహిళల కోలాటాలు, హారతులు, కుంకుమ తిలకాలు,గజమాలతో ఆహ్వానం పలికిన  ప్రజలు*

*గ్రామదేవతలను దర్శించి,వాడవాడలా తిరుగుతూ ఎదురొచ్చిన వృద్ధులను,మహిళలను,చిన్నపిల్లలను పలకరిస్తూ సాగిన ఎన్నికల ప్రచారం*

Read More  ఘనంగా క్రిస్మస్ గాస్పల్ వేడుక

*పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధి చూసి ఎన్నికల ప్రచారంలోని గ్రామ గ్రామాల్లో వివిధ పార్టీల నుండి టిఆర్ఎస్ లోకి చేరినIMG-20231120-WA0087 నాయకులు మరియు సంపూర్ణ మద్దతు తెలిపిన వివిధ సంఘాల నాయకులు..*

Read More సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన బోనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

*మహిళలతో సరదాగా కోలాటాలాడి, బతుకమ్మలను,బోనాలను ఎత్తుకున్న మంత్రి..*

*పెద్ద ఎత్తున  ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి మద్దతుగా బైక్ ర్యాలీలో పాల్గొన్న యువకులు..*

*ప్రచారంలో భాగంగా గౌడన్నలను తీసుకొచ్చిన నీరా సేవించిన మంత్రు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు..*

*ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న శ్రీమతి ఉషా దయాకర్ రావు గారు..*

*తమ ఆట పాటలతో ప్రచారాన్ని హోరెత్తించిన రేలారే ఫేమ్ గంగ, ప్రముఖ జానపద గాయని కనకవ్వ..*

రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారి కామెంట్స్..

*కొందరు కాంగ్రెస్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని బ్రోకర్ మాటలు  చెప్తుంటారు.. కానీ వాళ్లు ఎలాంటి వారో వాళ్ల గుణగణాలు ఎలాంటివో మనకు ఎవరికీ తెలియదు అలాంటి వారికి ఓటేస్తారా లేక 40 ఏళ్లు మీ మధ్యనే ఉండి మీకు అందుబాటులో ఉంటూ మీకు కష్టాలలో, మీ ఆపద సమయాల్లో ఆదుకునే మీ దయన్నను గెలిపించుకుంటారా మీరే తేల్చుకోండి అని ఆయన అన్నారు.. ..

*అలాగే నేను నా సొంత డబ్బులతో ప్రతి గ్రామాల్లో మహిళలకు కుట్టు శిక్షణ ఇప్పించి వారికి సంఘంలోని టెక్స్టైల్ పార్కులో ఉద్యోగాలు ఇప్పించాను.,అలాగే 22,000 మందికి డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించాను.

*రైతులకు రైతుబంధు ఎకరానికి 16,000, రైతులకే గాక ఎవరు చనిపోయిన సరే కూలీలకు  వారికి కూడా 5 లక్షల బీమా చేయిస్స్తున్నాం..

 *కూలీలకు నెలకు 3000 చొప్పున సంవత్సరానికి 36,000 ఇప్పిస్తాం..

*రేషన్ బియ్యం దొడ్డు బియ్యం కాకుండా సన్నబియ్యాన్ని ఇస్తామని హామీ ఇస్తున్నాం..

*వృధ్దులకు 2000 పెన్షన్ 4000 పెంచుతున్న ఘనత కూడా మన బి ఆర్ ఎస్ ప్రభుత్వానిది..


*మధ్యాహ్నం పాలకుర్తి నియోజకవర్గ ముదిరాజ్ మహాసభ లో ఎమ్మెల్సీ,తెలంగాణ రాష్ట్ర శాసనమండలి వైస్ చైర్మన్ శ్రీ బండా ప్రకాష్ ముదిరాజు గారితో పాటు పాల్గొన్న మంత్రి దయాకర్ రావు గారు మాట్లాడుతూ..

* మిషన్ కాకతీయ ద్వారా మన చెరువులను  తవ్వించి నీళ్లు తెప్పించి చేపలు పెంచుకుని తద్వారా 50 లక్షల ప్రజా సంపాదించుకునే చెరువులు మనకున్నాయి.. మన ముదిరాజ్ బిడ్డలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి  వెహికల్స్ కూడా పంపిణీ చేసిన ఘనత మన కేసీఆర్ ది..

*అలాగే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ముదిరాజ్ ఇంటి పిల్లలను వారి చదువు తగ్గట్టుగా ట్రైనింగ్ ఇచ్చి మంచి మంచి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత కూడా నాది
అని ఆయన అన్నారు..

*ప్రతి గ్రామానికి ఉన్న ముదిరాజ్ బిడ్డలందరికీ ఇల్లు ఇచ్చి ఒకవేళ కొత్తగా కట్టుకుని అప్పు చేసిన వారికి ఆర్థికంగా ఆదుకునే బాధ్యత కూడా తనదేనన్నారు...

*రాబోయే ఎన్నికల్లో మీరందరూ బీఆర్ఎస్ తీసుకొచ్చిన మేనిఫెస్టోను  ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు..

*వచ్చేనెల నుండే ఇంటింటికి  కూలి పని చేసే మహిళలకు 3000 కూడా వచ్చేలా ఏర్పాటు చేస్తున్నాం..

*అలాగే ప్రతి ఇంటిలో ఎవరైనా ఎవరైనా చనిపోయినా ఐదు లక్షల బీమా కూడా చేయించి ఇచ్చే బాధ్యత కూడా మన కెసిఆర్ ప్రభుత్వానిది అని పునరుద్ఘాటించారు..

*ప్రచారం ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నలో పాల్గొన్న శ్రీమతి ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు గారు మాట్లాడుతూ..*

*మీ దయన్నకు ప్రజలకు సేవ చేయడమే తెలుసు, రౌడీయిజం, భుకాబ్జాలు లాంటివి తెలీదు కాబట్టే వరుసగా 6 సార్లు గెలిపించారు మీరు ..
వాళ్ళు చెప్పుకోవడానికి (కాంగ్రెస్ పార్టీ) వాళ్లు ఏం చేశారని వచ్చి ఓటు  అడుగుతారు,అప్పుడు ఎప్పుడో కట్టిన ఇందిరమ్మ ఇల్లు తప్ప..
*ఒక్కసారి వేరే వాళ్లకు ఛాన్స్ ఇద్దామని అనుకునే వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, అభివృద్ధి చేసే వాళ్ళకి ఎన్ని సార్లు ఓటేసినా తప్పులేదు ఎందుకంటే వాళ్ళ ఆలోచన అంతా ప్రజలకు ఇంకా ఏం చేయాలని ఉంటుంది తప్ప దాచుకోవడానికి, దోచుకోవడానికి కాదు అని ఆమె అన్నారు..

ప్రచారంలో జిల్లా మండల మరియు గ్రామీణ స్థాయి బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు.

Views: 13
Tags:

Related Posts

Post Comment

Comment List