రేపు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది
కెసిఆర్ ఇచ్చే హామీలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం
న్యూస్ ఇండియా తెలుగు ,అక్టోబర్ 31 (నల్గొండ జిల్లా ప్రతినిధి) :ప్రచారంలో భాగంగా నెల్లిబండ గ్రామంలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ఈ సందర్భంగా మాట్లాడుతూ...సోనియమ్మ ఆరు విషయాలు ప్రతి ఊరికి పోయి చెప్పి రండి ఆరు గ్యారెంటీ పథకాల గురించి వివరించి చెప్పాలని చెప్పారు. తెలంగాణ ఇచ్చినాను విద్యార్థులు చనిపోతుంటే చూడలేక పోతున్న ఎందుకంటే నా కుటుంబంలో నా భర్తను కోల్పోయాను, మా అత్తను కోల్పోయినను ఈ దేశం కోసం, గర్భశోకం ఏందో నాకు తెలుసు కాబట్టి తెలంగాణలో ఒక్క బిడ్డ కూడా చనిపోవడానికి వీల్లేదు. కాంగ్రెస్ పార్టీకి ఎంత నష్టమైన నేను తెలంగాణ ఇస్తానని చెప్పేసి తెలంగాణ ఇచ్చింది
మన పిల్లలు బాధపడుతుర్రు లక్షల రూపాయలు పెట్టి కోచింగ్ తీసుకొని చదువుకున్నటువంటి పిల్లలు ఎగ్జాము రాశి అది వాయిదా పడేటప్పటికీ మనోవేదన చెందుతున్నటు వంటి పరిస్థితి చాలా మంది పిల్లలు చచ్చిపోతున్నారు. ఎందుకంటే ఇంటికి పోయి తల్లిదండ్రులకు ఏం చెప్పలేరు. చేసుకోవడానికి ఏం పనిలేదు పరీక్ష ఎప్పుడు పెడతారో తెలియదు. ఎప్పుడు రద్దు అయితదో తెలియదు. దీంతో మన బిడ్డలంతా కూడా బాధపడుతున్నటు వంటి ఒక పరిస్థితిని అందుకే సోనియా గాంధీ గారు చెప్పారు మిత్రులందరికీ ఒక భరోస్ ఇవ్వండి.రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది అధికారంలోకి వచ్చినంక రెండు లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని.సిలిండర్ ధర కూడా 500 రూపాయలకే గ్యాస్ ఇస్తామని సోనియా గాంధీ మనకు హామీ ఇచ్చారు.
Comment List