నకిరేకల్ పట్టణంలో ప్రచారం దూకుడు పెంచిన బీఎస్పీ పార్టీ

ప్రచారంలో పాల్గొన్న బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మేడి ప్రియదర్శిని

On
నకిరేకల్ పట్టణంలో ప్రచారం దూకుడు పెంచిన బీఎస్పీ పార్టీ

చిరు వ్యాపారుల సమస్యలు తెలుసుకుంటున్న మేడి ప్రియదర్శిని

 న్యూస్ ఇండియా తెలుగు ,అక్టోబర్ 27 (నల్గొండ జిల్లా స్టాపర్):నకిరేకల్ పట్టణంలో బహుజన సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మేడి ప్రియదర్శిని గారు ప్రచారంలో భాగంగా  పట్టణంలోని చిరు వ్యాపారవేత్తలు మరియు గడపగడపకు ఇంటికి తిరుగుతూ ప్రచారం చేస్తూ ఏనుగు గుర్తు ఓటు వేయాలని సూచించింది .అనంతరం మాట్లాడుతూ గతంలో ఉన్న ఎమ్మెల్యేలు పనితీరు నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యం రాత్రికి రాత్రే పార్టీలు మారుతూ వారి సొంత లాభం కోసం స్వార్థ రాజకీయాల కోసం జనాలని బలి పశువు చేస్తున్నారు .నార్కట్పల్లి డిపో తీసేయడం వల్ల అమ్మనబోల్ నుంచి నార్కట్పల్లికి విద్యార్థులు చేరుకోవడానికి నాన్న అవస్థలు పడుతున్నారు. బస్సు సౌకర్యాలు లేకపోవడం వల్ల ఆటోలు చార్జీలు విపరీతంగా ఉండడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాసన గోడు, బొప్పారం లింకు రోడ్లో అస్సవ్యస్తంగా ఉన్నాయి. ఉన్నవాడు ఇంకా పైకి ఎదుగుతున్నాడు లేని వాడు ఇంకా కిందికి పోతున్నాడు .ఇది ప్రజలు గమనించాలి నన్ను ఈసారి ఏనుగు గుర్తుకు ఓటు వేసి నకిరేకల్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పంపాలని కోరుకుంటున్నా. 

Views: 40

About The Author

Post Comment

Comment List