చెడుపై సాధించిన విజయమే విజయదశమి

రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉండాలి

చెడుపై సాధించిన విజయమే విజయదశమి

 

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం లోని పులిగిల్ల గ్రామంలో విజయదశమి సందర్భంగా గ్రామపంచాయతీ ఆవరణలోని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. అనాదిగా వస్తున్నచెడుపై మంచి సాధించిన విజయమే విజయ దశమి దినముగా అనాదికాలం నుండి భాగింపబడుతున్నదని శాస్త్రికులు పేర్కొన్నారు. దీని యొక్క సారాంశం ఏమనగా లోక కళ్యాణం కొరకు ఆనాడు శ్రీరాముడు రావనుడి పై యుద్ధం చేసి విజయం సాధించిన దానికి సంకేతం గానే ప్రజలందరూ విజయదశమి జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. అదేరోజు పాండవులు జమ్మి చెట్టు మీద ఉంచిన ఆయుధాలకు ఆయుధపూజ నిర్వహించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుందని చెప్పుకొచ్చారు ఇంతటి చరిత్ర కలిగిన విజయదశమిని ప్రజలందరూ సుఖశాంతులతో జరుపుకోవాలని గ్రామ సర్పంచ్  జక్క వెంకట్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పుర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

Views: 156

Post Comment

Comment List