సంక్షేమ ఫలాలు అందరికీ అందాలి: ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి
అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మార్కాపురం ఎమ్మెల్యే శ్రీ నాగార్జున రెడ్డి అధికారులకు సూచించారు. మండలంలోని గొట్లగట్టు సచివాలయము పరిధిలో వెలుగొండ రాయుని పల్లె గ్రామంలో బుధవారం సాయంత్రం గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ కర దీపికలను పంపిణీ చేస్తూ ఏమ్మా, ఏం పెద్దాయన మీకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయా లేదా, వాలంటీర్లు మీ దగ్గరకు వచ్చి మీ సమస్యలను తెలుసుకుంటున్నారా లేదా అని పలువురిని అడుగుతూ ఆరా తీశారు. జగనన్న ప్రభుత్వం పార్టీలకు అతీతంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించే దిశగా అడుగులు వేస్తున్నారన్నారు. భవిష్యత్తులో జగనన్న ప్రభుత్వాన్ని ఆదరించాలని కోరారు.. సమస్యలను ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి గారికి గ్రామస్తులు విన్నవించారు. ఈ కార్యక్రమంలో కంభం మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసరెడ్డి ,ఎంపీపీ, జెడ్పిటిసి, మండల కన్వీనర్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Comment List