TRS-Congress alliance : వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్- కాంగ్రెస్ పొత్తు? పీకే ప్లాన్ లీక్!

On

TRS-Congress alliance : ప్రగతి భవన్‌లో రెండో రోజు కూడా CM కేసీఆర్‌- ప్రశాంత్‌ కిషోర్‌ మధ్య చర్చలు కొనసాగాయి. శనివారం ఉదయం తొమ్మిదిన్నరకు వెళ్లిన PK రాత్రి కూడా అక్కడే బస చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ హ్యాట్రిక్‌ కొట్టాలని భావిస్తున్న TRS.. ఇందు కోసం ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధం లేదు.   అందుకే.. నియోజకవర్గాల వారీగా సర్వేలు చేయించి.. వాటిపై సమగ్రంగా చర్చిస్తోంది. ఇప్పటికే PK చేసిన సర్వేల ఆధారంగా ప్రభుత్వంపైన, […]

TRS-Congress alliance : ప్రగతి భవన్‌లో రెండో రోజు కూడా CM కేసీఆర్‌- ప్రశాంత్‌ కిషోర్‌ మధ్య చర్చలు కొనసాగాయి. శనివారం ఉదయం తొమ్మిదిన్నరకు వెళ్లిన PK రాత్రి కూడా అక్కడే బస చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ హ్యాట్రిక్‌ కొట్టాలని భావిస్తున్న TRS.. ఇందు కోసం ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధం లేదు.

 

Read More  ఘనంగా క్రిస్మస్ గాస్పల్ వేడుక

అందుకే.. నియోజకవర్గాల వారీగా సర్వేలు చేయించి.. వాటిపై సమగ్రంగా చర్చిస్తోంది. ఇప్పటికే PK చేసిన సర్వేల ఆధారంగా ప్రభుత్వంపైన, పార్టీపైన ఉన్న విమర్శలు లేకుండా దిద్దుబాటు ఏం చేయాలో సమాలోచనలు చేస్తున్నారు.

 

Read More  ఘనంగా క్రిస్మస్ గాస్పల్ వేడుక

ఐతే.. త్వరలో కాంగ్రెస్‌ కండువా కప్పుకోబోతున్న PK.. ఇకపై TRSకి వ్యూహకర్తగా కొనసాగే అవకాశం ఎంత వరకూ ఉంది అనే దానిపై భిన్న వాదనలు ఉన్నాయి. ఆయన కాంగ్రెస్‌లో చేరే సంగతి అటుంచితే.. తమతో ఫుల్‌టైమ్‌ పనిచేసేందుకు డీల్‌ కుదిరిందని TRS వర్గాలు చెప్తున్నాయి.

Read More సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన బోనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమైన ప్రశాంత్‌ కిషోర్‌.. నిన్నటి నుంచి ప్రగతి భవన్‌లోనే ఎందుకు ఉన్నట్టు…! దీనిపై TRS వాదన ఒకటైతే.. కాంగ్రెస్‌ నేతలు చెప్పేది మరొకటి. తమ పార్టీలోకి వచ్చే ముందే వ్యూహకర్తగా వివిధ పార్టీలతో తనకున్న డీల్స్ అన్నీ PK రద్దు చేసుకుంటున్నారని హస్తం నేతలు చెప్తున్నారు.

TRS నేతలు ఆశపడుతున్నట్టు కాంగ్రెస్‌తో పొత్తుకు కోసం KCR చేస్తున్న ప్రయత్నాలు ఫలించవు అంటున్నారు. తాము ఒంటరిగానే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు కాంగీయులు. ముఖ్యమంత్రి KCRలో ఓటమి భయం మొదలైందని.. అందుకే ప్రశాంత్‌ కిషోర్‌తో భేటీపై రకరకాల లీకులు ఇస్తున్నారని విమర్శిస్తున్నారు. పొలిటికల్ డ్రామాలో భాగంగా ఎన్ని ఎత్తులు వేసినా.. అవన్నీ ప్రజలు అర్థమవుతున్నాయంటున్నారు.

పీకే ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ వచ్చి 2 రోజులు అయ్యింది. ప్రగతి భవన్‌లోనే మకాం వేసి.. చాలా కీలకమైన మేధోమథనం సాగిస్తున్నారు. అసలు ఎందుకు ఇదంతా..?

ఓ పక్క జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ బలోపేతానికి చర్యలు తీసుకోవాలంటూ ఓ ఫార్ములా చెప్తూనే.. అవసరమైన చోట్ల ప్రాంతీయ పార్టీలతో పొత్తును PK ప్రతిపాదించారు. ఐతే.. తెలంగాణ లాంటిచోట్ల ఇది సాధ్యమయ్యే పనేనా.. ఉప్పు నిప్పులా ఉన్న కాంగ్రెస్‌-TRS కలిసి పోటీ చేస్తాయా..?

అలా కానప్పుడు PK ప్రగతిభవన్‌కి వెళ్లింది డీల్‌ క్యాన్సిల్‌ చేసుకోవడానికా..? ఇప్పుడిలా ఎన్నో ఊగాహానాలు తెరపైకి వచ్చాయి. అసలు ఢిల్లీలో ఏం జరుగుతోంది..? ఇప్పటికే బెంగాల్‌, ఏపీ, తెలంగాణలో అధికారపార్టీలకు పీకే వ్యూహకర్తగా ఉన్నారు. ఆయన కాంగ్రెస్ ప్రధానకార్యదర్శిగా పార్టీలో చేరాలనుకుంటే.. ఇతర పార్టీలకు వ్యూహకర్తగా పనిచేయడం సరికాదని ఏఐసీసీ ఇప్పటికే స్పష్టం చేసింది.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News