ఆలయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తా: ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగా రెడ్డి..
ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి సమక్షంలో చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం...
శ్రీ గోవింద రంగనాథ స్వామి దేవాలయ కమిటీ నూతన అధ్యక్షులుగా నల్లబోయిన అనిల్ రెడ్డి, డైరెక్టర్లుగా సంరెడ్డి వెంకట్ రెడ్డి, మేకల ఎల్లయ్య, బాలగోని భూషణ్ గౌడ్, డప్పు సుమలత ప్రమాణస్వీకారం చేశారు.
శ్రీ గోదారంగనాథ స్వామి దేవాలయ నూతన కమిటీ ఎన్నిక
ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి సమక్షంలో
చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం...
ఆలయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తా: ఎమ్మెల్యే
ఎల్బీనగర్ జనవరి 20 (న్యూస్ ఇండియా ప్రతినిధి): శ్రీ గోదారంగనాథ స్వామి దేవాలయ ఆలయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తానని ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్మెట్టు మండలం తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని తొర్రూరు గ్రామ గుట్టపై వెలసినటువంటి శ్రీ గోదారంగనాథ స్వామి దేవాలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం మహోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, టీజీ ఆర్డీసీ చైర్మన్ మల్ రెడ్డి రామ్ రెడ్డి, తుర్కయంజాల్ మున్సిపాలిటీ చైర్ పర్సన్ మల్ రెడ్డి అనురాధ రామిరెడ్డి, వైస్ చైర్ పర్సన్ గుండ్లపల్లి హరిత ధనరాజ్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర కోపరేటివ్ అపెక్స్ బ్యాంక్ వైస్ చైర్మన్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, గడ్డిఅన్నారం వ్యవసాయ పండ్ల మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి, తుర్కయంజాల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, కౌన్సిలర్ కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్, కౌన్సిలర్లు తాళ్లపల్లి సంగీత మోహన్ గుప్తా, వేముల స్వాతి అమరేందర్ రెడ్డి, మునగనూరు గ్రామ మాజీ సర్పంచ్ నక్క రాధిక శ్రీనివాస్ గౌడ్, గడ్డి అన్నారం వ్యవసాయ పండ్ల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిహెచ్. భాస్కరా చారి, గ్రామ పెద్దల సమక్షంలో నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగా రెడ్డి, మల్ రెడ్డి యాదిరెడ్డి, మల్ రెడ్డి రామ్ రెడ్డి లను వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అనంతరం ఎమ్మెల్యే స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. శ్రీ గోవింద రంగనాథ స్వామి దేవాలయ కమిటీ నూతన అధ్యక్షులుగా నల్లబోయిన అనిల్ రెడ్డి, డైరెక్టర్లుగా సంరెడ్డి వెంకట్ రెడ్డి, మేకల ఎల్లయ్య, బాలగోని భూషణ్ గౌడ్, డప్పు సుమలత ప్రమాణస్వీకారం చేశారు.
Comment List