నిస్సహాయ స్థితిలో ఉన్న కుటుంబానికి స్పందించిన హృదయాలు...

By Ramesh
On
నిస్సహాయ స్థితిలో ఉన్న కుటుంబానికి స్పందించిన హృదయాలు...

 న్యూస్ ఇండియా తెలుగు, నవంబర్16 (బచ్చన్నపేట మండలథరిపోర్టర్ జేరిపోతుల రమేష్)

బచ్చన్నపేట మండల కేంద్రానికి చెందిన కర్రె శ్రీకాంత్ (15) గత రెండు సంవత్సరాలుగా బ్రెయిన్ క్యాన్సర్ తో బాధపడుతూ,రెండుసార్లు బ్రెయిన్ ఆపరేషన్ చేసిన ఫలితం లేకుండా పోయింది. దాంతో మళ్లీ ఆపరేషన్ చెయ్యాలని వైద్యులు చెప్పగా, వైద్యం ఖర్చుకు 4 లక్షల రూపాయలు అవుతుందని చెప్పడంతో నిస్సహాయ స్థితిలో ఉన్న కుటుంబ సభ్యులు ఏమి చేయాలో తోచని పరిస్థితుల్లో తల్లిదండ్రులు కన్నీరు మున్నూరుగా విలపిస్తున్నారు.  తమ కుమారుడికి వైద్యం ఖర్చులు భరించలేని తమ పరిస్థితిని తలుచుకుని తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. తమ కుమారుడి వైద్యం కోసం దాతలు ఎవరైనా ఆర్థిక సాయం అందించాలని ప్రాధేయ పడుతున్నారు. శ్రీకాంత్ పరిస్థితిని చూసిన గల్లి యువత మేము సైతం శ్రీకాంత్ కు అండగా ఉంటామని, సహాయం చేపిస్తామని ముందుకు వచ్చి, వివిధ సామాజిక మధ్యమాల ద్వారా పంపిన వీడియో క్లిప్పును అప్లోడ్ చేయగా, అది చూసిన దాతలు ఫోన్ పే గూగుల్ పేటీఎంలో ద్వారా తమ వంతు సహాయ సహకారాలు అందించిన మొత్తం డబ్బులను 61550 రూపాయల శ్రీకాంత్ కుటుంబానికి అందజేసి మనోధైర్యనీ నింపారు. ఆపదలో ఉన్న కర్రె శ్రీకాంత్ కు అండగా నిలిచి మీ యొక్క గుప్పిళ్లు విప్పి మీ ద్రాతృత్వాన్ని చాటినా ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. దాతలు ఎవరైనా శ్రీకాంత్ కుటుంబానికి అండగా నిలవాలని తమ వంతు సహకారాలు 9652700712 గల నంబర్ గూగుల్ ఫోన్ పే పేటియం ద్వారా ఆర్థిక సాయం అందించాలని కోరారు.

Views: 545
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News