పెంచిన ఎంబీఏ సెమిస్టర్ పరీక్షల ఫీజులను వెంటనే తగ్గించాలి...
ఎఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి శివకుమార్ గౌడ్..
పెంచిన ఎంబీఏ సెమిస్టర్ పరీక్షల ఫీజులను వెంటనే తగ్గించాలి...
ఎఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి శివకుమార్ గౌడ్..
ఎల్బీనగర్
, జనవరి 21 న్యూస్ ఇండియా ప్రతినిధి:- ఆఖిల భారత యువజన సమాఖ్య (AIYF) రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పి. శివకుమార్ గౌడ్ మాట్లాడుతూ ఓయూ పరిధిలోని ఎంబీఏ కోర్సులకు సెమిస్టర్ ఫీజును 5000 రూపాయలను వసూలు చేయడం పేద విద్యార్థులకు తుది భారంగా మారిందని అన్నారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేయకుండా, ఏటా విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్స్ ఇవ్వకుండా సెమిస్టర్ ఫీజులు పెంచడం ఎంతో విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఎంబీఏ వృత్తి విద్య కోర్సు చేయడం భారంగా మారిందని, పేదల పాలిట అందని ద్రాక్షగా ఎంబీఏ కోర్సు ఉందని అన్నారు. సెమిస్టర్ కు 5000 రూపాయల ఫీజులు వసూలు చేయడం అంటే సంవత్సరానికి 10000 రూపాయలు పేద విద్యార్థులకు భారంగా ఉంటుందని అన్నారు. ఇప్పటికైనా ఓయూ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం ఎంబీఏ విద్యార్థుల గోస అర్థం చేసుకుని పెంచిన MBA పరీక్ష ఫీజులను వెంటనే తగ్గించాలని అఖిల భారత యువజన సమాఖ్య (AIYF) గా వారు డిమాండ్ చేశారు.
Comment List