రైతాంగ ఉద్యమం తీవ్రతరం చేయండి

ఏఐకేఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు

By Venkat
On
రైతాంగ ఉద్యమం తీవ్రతరం చేయండి

సుదమల్ల భాస్కర్ పిలుపు

బెంగళూరు: దక్షిణాది రాష్ట్రాల సంయుక్తా కిసాన్ మోర్చా నాయకులు పిలుపునిచ్చారు. బెంగళూరు గాంధీభవన్లో రెండు రోజులు పాటు నాయకత్వ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి రాష్ట్రాల నుంచి 250 ప్రతినిధులు హాజరయ్యారు. ఆరు రాష్ట్రాల నాయకులు ఈ సందర్భంగా ఎస్కేయం బలోపేతం కోసం కృషి చేయాలని కోరారు. జాతీయ స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు ఎస్కేయం నిర్మాణాలను బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ రంగం ఎదుర్కొంటోన్న సమస్యలను, రైతాంగ డిమాండ్లు, ఇతర ఆహార పంటల సమస్యలను సూక్ష్మంగా అధ్యయనం చేసి పోరాటాలు చేయాలన్నారు. అటవీ సంరక్షణ, నీటిపారుదల, భూ నిర్వాసితుల సమస్యలు, కౌలు రైతుల సమస్యలపై ప్రత్యేకంగా ఉద్యమాలు చేయాలన్నారు. ఈ పోరాటాల్లో కలిసి వచ్చే అన్ని శక్తులను, ముఖ్యంగా మహిళల్ని, ఆదివాసీల్ని, మైనార్టీల్ని కలుపుకొని పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలిండియా కిసాన్ సంఘటన్(ఏఐకెఎస్) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మాన్యపు భుజేందర్ ఏఐకేఎస్ జాతీయ కమిటీ సభ్యుడు దొంతి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.IMG-20241008-WA0457

Views: 16
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News