పెద్దకడుబూరులో భారీ వర్షం - ఈ వర్షం మంచికే సంకేతం...!

- భారీగా కురిసిన వర్షానికి అధిక సంఖ్యలో మురిసిపోయిన రైతన్నలు...

On
పెద్దకడుబూరులో భారీ వర్షం - ఈ వర్షం మంచికే సంకేతం...!

న్యూస్ ఇండియా ప్రతినిధి/ పెద్దకడుబూరు మండలం అక్టోబర్ 06 :- మండల కేంద్రమైన పెద్దకడుబూరు గ్రామంలో ఆదివారం సాయంత్రం వేళ భారీ వర్షం కురిసింది. చాలా రోజులుగా బెట్టగా ఉన్న పొలాల్లో ఈ వర్షంతో గ్రామం చుట్టూ ప్రక్కల ఉన్న పొలాలు మొత్తం నీటితో పూర్తిగా తడిసిపోయాయి. దాదాపు ఈ వర్షం 50నిముషాల పాటు కురిసింది. ఇలాంటి భారీ వర్షం కురవడంతో పెద్దకడుబూరు గ్రామంలో ఉన్న అధిక సంఖ్యలో రైతన్నలు మురిసిపోయారు. ఇప్పుడు కురిసిన ఈ వర్షం గ్రామంలో మంచికే సాంకేతమని పలువురు రైతులు చర్చించుకున్నారు. ఖరీఫ్ సీజన్ లో మొదట వేసిన పంటలకు సకాలంలో వర్షం కురవలేదని కొంత మంది రైతులు బాధపడ్డారు. అయితే చాలా రోజుల తరువాత ఇటీవల కురిసిన వర్షంతో రైతులకు ఒకరకంగా పర్వాలేదనిపించింది. కానీ ఖరీఫ్ లో వేసిన ప్రత్తి పంటల చివరి దశలో ఇప్పుడు ఇలాంటి వర్షం కురువడంతో ప్రత్తి రైతులకు కాస్త ఊరట లభించింది. ప్రత్తి పంటల చిగురు కాపుకు ఈ వర్షం చాలా దోహదపడిందని పలువురు రైతులు చర్చించుకున్నారు. అంతే కాకుండా ముఖ్యంగా వరి, మిరప, సద్దా మరియు కొర్ర పంటలు వేసిన రైతులందరికి ఈ వర్షం చాలా లాభందాయకమేనని గ్రామంలోని రైతన్నలు మాట్లాడుకోవడం విశేషం. పెద్దకడుబూరు గ్రామంలో వివిధ దశలలో ఇటీవల కురిసిన వర్షం గ్రామం ఒకవైపున మాత్రమే కురిసిందని, ఇప్పుడు కురిసిన వర్షం మాత్రం గ్రామం నాలుగు వైపులుగా కురువడంతో అధిక సంఖ్యలో రైతన్నలు ఆనందం వ్యక్త పరిచారాని చెప్పొచ్చు. మొత్తంగా ఈ ఆదివారం సాయంత్రం కురిసిన వర్షంతో చాలా మంది రైతులకు మరియు పంటలకు మంచి సంకేతమన్నట్లు రైతన్నలు మాట్లాడుకున్నారు. ఏదేమైనప్పటికి కష్టపడి రైతన్నలు పండించిన పంటలకు మార్కెట్ లో సరైన గిట్టుబాటుదరులు లభిస్తే, రైతన్నలు బాగుపడతారని మరికొంత మంది రైతులు చర్చించుకున్నారు. ఇప్పటికి రైతులు పండిస్తున్న పంటలైన ప్రత్తి, మిరప, మొక్క జొన్న మరియు వివిధ రకాల పంటలకు ప్రస్తుతం మార్కెట్ లో సరైన గిట్టుబాటు ధరలు లేవని, పంటలలో ఉపయోగించిన పురుగు మందులు మరియు రసాయనిక ఎరువుల రేట్లు అధికంగా ఉండడంతో పంటలకు వచ్చిన లాభం మొత్తం దుకాణదారులకే సరిపోతుందని కొందరు రైతన్నలు చింతించారు. ప్రస్తుత ప్రభుత్వం సకాలంలో రైతన్నలకు అండగా నిలచి, పెట్టుబడి సహాయంతో రైతులను ఆర్ధికంగా ఆదుకోవాలని పలువురు రైతుల నుండి విమర్శలు ఘట్టిగానే వినిపిస్తున్నాయి...06272021230924n45

Views: 79
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News