పెద్దకడుబూరులో శరన్నవరాత్రులు శ్రీ శ్రీ కాళికాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు...!
విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శరన్నవరాత్రి పూజలు...
శ్రీ కాళికదేవికి పూజలు చేపట్టిన విశ్వబ్రాహ్మణులు హరికృష్ణ ఆచారి, వినోద్ కుమార్ ఆచారిలు.
న్యూస్ ఇండియా/ పెద్దకడుబూరు మండలం అక్టోబర్ 06 :- పెద్దకడుబూరు మండలములోని శ్రీశ్రీ కాళికాదేవి ఆలయములో శరన్నవరాత్రి సందర్బంగా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. ఆస్వయుజ మాసం శుక్లపక్షం తదియ ఆదివారం ఉదయం శ్రీ కాళికాదేవి అమ్మవారికి. విశ్వబ్రాహ్మణ హరికృష్ణ ఆచారి మరియు వినోద్ కుమార్ ఆచారి లు అమ్మవారికి జలాభిషేకము చేసి, వస్త్రాభరణం, ఆకు పూజ మరియు పూల అలంకరణ గావించి అమ్మవారికి కుంకుమార్చన చేసారు. అమ్మవారికి పంచామృతాభిషేకము ధూపదీప నైవేద్యములు సమర్పించి శ్రీ శ్రీ కాళికాదేవి అమ్మవారిని బాల త్రిపుర సుందరీ దేవిగా అలంకరించి పూజించడం జరిగిందని విశ్వబ్రాహ్మణ నరసింహ ఆచారి తెలిపారు. పూజా కార్యక్రమములో విశ్వబ్రాహ్మణ సంఘం పెద్దలు మరియు గ్రామ భక్తాతులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రసాదములు స్వీకరించారు...
Comment List