అవంతి గ్రూప్స్ ని యూనివర్సిటీ స్థాయికి తీసుకెళ్తా చైర్మన్ శ్రీనివాసరావు..
అవంతి గ్రూప్స్ ని యూనివర్సిటీ స్థాయికి తీసుకెళ్తా చైర్మన్ శ్రీనివాసరావు..
ఎల్బీనగర్, అక్టోబర్ 04 (న్యూస్ ఇండియా ప్రతినిధి): అవంతి గ్రూప్ ఆఫ్ కాలేజిలలో అబ్డల్లాపూర్మెట్ మండల గుంతపల్లి గ్రామంలో గల ఇంజనీరింగ్ కాలేజ్ 20వ వార్షికోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ స్టేట్ కమిటీ చైర్పర్సన్ లింబాద్రి ,ఎలిప్ వైస్ ప్రెసిడెంట్ త్రిపురాంబ, టీ హబ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ లు హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పిడుస్తున్న సమస్య యువతకి నిరుద్యోగమని అన్నారు. యువత మంచి నైపుణ్యం గల విద్యను అభ్యసించి ఉద్యోగాలతో పాటు కొద్దిమంది యువత అయిన సెల్ఫ్ ఎంప్లాయిమెంట్స్ గా మారి కొంతమందికైనా ఉద్యోగాలు అందించే స్థాయికి ఎదగాలని కోరారు.. ఇందులో భాగంగా అవంతి చైర్మన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. మా కాలేజీలో అభ్యసించిన విద్యార్థులకు సరైన అవకాశాలు కల్పించేందుకు అన్ని విధాల కృషి చేస్తున్నామని తెలియజేశారు. విద్యార్థులు కష్టపడి చదివి అత్యున్నత స్థానాలలో ప్రతి ఒక్కరు ఉండాలని ఆయన కోరారు. అలాగే రాబోయే రోజుల్లో యూనివర్సిటీ స్థాయికి ఈ కాలేజీని తీసుకెళ్లడమే నా లక్ష్యమని శ్రీనివాసరావు తెలియజేశారు . అనంతరం ఆటల పోటీలలో పాల్గొనీ విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ శీనివాసరావు, విద్యార్థులు , కాలేజీ యాజమాన్యంతో పాటు సిబ్బంది తదితరులు
పాల్గొన్నారు.
Comment List