వేల్పుగొండ గ్రామంలో విగ్రహం చొరికి పాల్పడిన ఏపీకి చెందిన యువకులు
పార్శ్వనాథుడు తీర్థంకర విగ్రహం చోరి కేసులో ఐదుగురు యువకులు అరెస్ట్
నెల రోజుల వ్యవధిలో కేసును ఛేదించిన టేక్మాల్ పోలీసులు మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ కుమార్ రెడ్డి
అత్యాశకు పోయి కటకటాల పాలైన యువకులు
- పార్శ్వనాథుడు తీర్థంకర విగ్రహం చోరి కేసులో ఐదుగురు యువకులు అరెస్ట్
- విగ్రహం చోరికి పాల్పడిన ఏపీకి చెందిన బీటెక్ చదివిన యువకులు
- నెల రోజుల వ్యవధిలో కేసును ఛేదించిన టేక్మాల్ పోలీసులు
- మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ కుమార్ రెడ్డి
న్యూస్ ఇండియా ఇండియా (టేక్మాల్ ప్రతినిధి జైపాల్ అక్టోబర్ 4) మెదక్ జిల్లా టేక్మాల్ మండలం లో ఉన్నత విద్యను అభ్యసించిన యువకులు వ్యసనాలకు అలవాటుపడి అత్యాశకు పోయి అతి పురాతన విగ్రహాన్ని దొంగలించి కట కటాలా పాలైన సంఘటన టేక్మాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ కుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా ఆచంటకు చెందిన చిలుకురి అనువింద్, తోట జగత్, పెద్దపేటకు చెందిన బందెల శుభనంద్, కృష్ణాజిల్లా నారాయణరావు నగర్ కు చెందిన పోలిశెట్టి తేజసాయిబాబు, కోటరెడ్డిపేటకు చెందిన జొన్నలగడ్డ మహేష్ బాబు లు బీటెక్ చదివి హైదరాబాద్ లో కలిసి ఉంటున్నారు. పురాతన విగ్రహాలను విక్రయించడం ద్వారా సులభంగా ఆధిక డబ్బులు సంపాదించవచ్చని యూట్యూబ్ లో తెలుసుకున్నారు. ఈజీ మనీ సంపాదించాలనే దురాశతో గూగుల్, యూట్యూబ్లో ఆదరణ లేకండా ఉన్న పురాతన దేవాలయాలు, విగ్రహాల గురించి వెతికారు. అందులో టేక్మాల్ మండలం వెలుపుగొండ గుట్టపై జైన మతానికి చెందిన అతి పురాతన పార్శ్వనాథుడు తీర్థంకర పురాతన విగ్రహం గురించి వారికి తెలిసింది. దీంతో ఆ విగ్రహాన్ని అమ్మడం వల్ల అధికంగా డబ్బులు సంపాదించవచ్చనే నిర్ణయానికి వచ్చారు. విగ్రహాన్ని దొంగిలించడానికి అవసరమైన ప్రణాళికను రూపొందించుకున్నారు. జూలై 25 వ తేదీన అనువిన్ జగన్ వేల్పుగొండకు వచ్చి విగ్రహం ఉన్నచోట పరిశీలించారు. మరుసటి రోజు 26 జూలై అర్ధరాత్రి ఐదుగురు యువకులు వాహనం తీసుకొని వేల్పుగొండకు వచ్చారు. వారు అనుకున్నట్లుగా ఇక్కడి నుండి విగ్రహాన్ని అపహరించుకొని వెళ్లారు. అక్టోబర్ 4వ తేదీన విగ్రహాన్ని అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు టేక్మాల్ ఎస్సై రాజేష్ తన బృందంతో వెళ్లి పట్టుకున్నారు. వారిని టేక్మాల్ పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి విచారణ చేయడంతో విగ్రహాన్ని అపహరించినట్లు నేరాన్ని ఒప్పుకున్నారని ఎస్పీ ఉదయ్ కుమార్ తెలిపారు. కేసు నమోదు చేసి నేరస్తులను రిమాండ్ కు తరలించారు. ప్రెస్ మీట్ లో డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐ రేణుక, ఎస్సై రాజేష్, ఏఎస్సై తుక్కయ్య, ఐబి పార్టీ రఘునాథ్, పోలీసు సిబ్బంది ఉన్నారు.
Comment List