రేపటితో వంద రోజులు- ప్రజలు మెచ్చిన పాలన మనది...ఎన్ రాఘవేంద్ర రెడ్డి.
కూటమి ప్రభుత్వం 100రోజులలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోవాలి.
న్యూస్ ఇండియా ప్రతినిధి/ పెద్దకడుబూరు మండలం సెప్టెంబర్ 19 :- మంత్రాలయం నియోజకవర్గం లోని ప్రతి గ్రామంలోని నాయకులు కార్యకర్తలు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 100 రోజుల పాలనలో సాధించిన విజయాలు, తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను మీ గ్రామ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ ఎన్ రాఘవేంద్ర రెడ్డి గురువారం విలేకరుల సమావేశంలో తెలియచేయడం జరిగింది. ఆయన మాట్లాడుతూ రేపు శుక్రవారం నుండి మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఎన్.రాఘవేంద్ర రెడ్డి నాలుగు మండలాల్లో పర్యటన షెడ్యూల్ ను విడుదల చేసారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి నాలుగు మండలాల పర్యటన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలో సాధించిన విజయాలు, తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, అదేవిధంగా వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను నాలుగు మండలాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తిప్పికొట్టాలన్నారు. టీడీపీ పార్టీ నాయకులు, మిత్రపక్ష పార్టీలు బీజేపీ, జనసేన, నాయకులు, కార్యకర్తలు ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ , ప్రజల ప్రతీ సమస్యను తీరుస్తామని హామీ ఇచ్చారు. రేపటి నుండి మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఎన్.రాఘవేంద్ర రెడ్డి పర్యటన షెడ్యూల్ ఈ విధంగా ఉంది. మొదటిరోజు 20-09-2024 శుక్రవారం చెట్నీహళ్లి గ్రామం మంత్రాలయం మండలం, రెండవరోజు 21-09-2024 శనివారం సులేకేరి గ్రామం కౌతాళం మండలం, మూడవరోజు 22-09-2024 ఆదివారం కమ్మలదిన్నె గ్రామం పెద్దకాదుబుర్ మండలం, నాలుగవరోజు 23-09-2024-సోమవారం దిద్ది గ్రామం కోసిగి మండలం, ఐదవరోజు 24-09-2024- మంగళవారం చిలకలడోనా గ్రామం మంత్రాలయం మండలం, ఆరవరోజు 25-09-2024- పెద్దకడుబుర్ టౌన్, ఏడవరోజు 26-09-2024- గురువారం కోసిగి టౌన్ లో ఈ కార్యక్రమానికి నాలుగు మండలాల కన్వినర్లు,టీడీపీ,బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు అలాగే క్లస్టర్, యూనిట్,బూత్ ఇంచార్జిలు మరియు తెలుగు యువత, ఐటీడీపి ,టీఎన్ ఎస్ఎఫ్,టీఎన్టీయుసి, నందమూరి అభిమానులు వివిధ హోదాలలో ఉన్న ప్రతి ఒక్క టీడీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొనాలని మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఎన్. రాఘవేంద్ర రెడ్డి...
Comment List