కె పి హెచ్ బి టెంపుల్ బస్ స్టాప్ లో గణనాథుడికి ప్రత్యేక పూజలు
- శేరి సతీష్ రెడ్డి కూకట్ పల్లి నియోజకవర్గ కాంగ్రస్ పార్టీ మాజీ అధ్యక్షుల ఆధ్వర్యంలో న్యూస్ ఇండియా (హైదరాబాద్ ప్రతినిధి జైపాల్ సెప్టెంబర్ 19) రాష్ట్రవ్యాప్తంగా గణేశ్ వేడుకల సందడి కొనసాగుతోంది. గణపతి బప్పా మోరియా నామస్మరణతో ఊరూవాడా మారుమోగుతున్నాయి. కె పి హెచ్ బి టెంపుల్ బస్ స్టాప్ ఆవరణలో శేరి సతీష్ రెడ్డి కూకట్ పల్లి నియోజకవర్గ కాంగ్రస్ పార్టీ మాజీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి గణపతికి రంగురంగుల విద్యుత్ కాంతులతో అందంగా అలంకరించిన మండపాల్లో కొలువుదీరిన గణనాథులు, విశేష పూజలందుకుంటున్నారు. లోసప్తముఖ వినాయకుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తుండటంతో మండపాలన్నీ ఆకట్టుకుంటున్నాయి. ఈ కార్యక్రమంలో సంజీవ రావు, అరవింద్ రెడ్డి, రాజు, గిరీ, నవీన్, సూరిబాబు, గోపాల్ చౌదరి, లక్ష్మి, ఆర్ కే రెడ్డి, శ్రీకాంత్, మల్లేష్ యాదవ్, ఫని కుమార్, ఎర్ర బాబాన్న తదితరులు పాల్గొన్నారు.
Comment List