రేపటి (సెప్టెంబర్ 9న) సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు
జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్
జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలి.
రేపటి (సెప్టెంబర్ 9న) సోమవారం రోజు జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు *జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్* ఆదివారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.
భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో జిల్లాస్థాయి అధికారులను క్షేత్రస్థాయిలో ఇంటింటి సర్వే నిర్వహించేందుకు గాను మండలాలకు ప్రత్యేక అధికారులుగా నియమించినందున, వాతావరణ శాఖ సూచనల మేరకు రానున్న రెండు, మూడు రోజులు జిల్లాలో భారీ వానలు పడే అవకాశం ఉన్నందున ప్రజల సౌకర్యార్థం ఈ సోమవారం నాడు జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
కావున జిల్లాలోని ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి, ప్రజావాణి దరఖాస్తులతో
ఈ సోమవారం కలెక్టర్ కార్యాలయమునకు రావొద్దని, వర్షాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు.
Comment List