బిజెపి ఆధ్వర్యంలో జాతీయ గీతాలాపన కార్యక్రమం
కొత్తగూడెంలో కె.వి రంగా కిరణ్ సారథ్యంలో జాతీయ పతకలతో భారీ ర్యాలీ
ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు
భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా నరేష్) ఆగస్టు 13: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో బిజెపి పార్టీ అధ్యక్షులు కె.వి రంగా కిరణ్ ఆధ్వర్యంలో మంగళవారం జాతీయ గీతా ఆలాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ప్రియదర్శిని ,వివేకవర్ధిని విద్యార్థులు పాల్గొని జాతీయ పతాకంతో కొత్తగూడెంలో భారీ ర్యాలీని నిర్వహించి, పోస్ట్ ఆఫీస్ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహానికి జిల్లా అధ్యక్షులు పూలదండను వేసి భారత్ మాతాకీ జై అని నినాదాలు చేశారు. అనంతరం పోస్టర్ సెంటర్లో విద్యార్థులు, బిజెపి నాయకులు, మానవహరంగా నిలబడి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ కౌన్సిల్ మెంబర్ కుంజా ధర్మ, ముసుగు శ్రీనివాస్ రెడ్డి, జిల్లా సెక్రెటరీ నిర్మల, జిల్లా ప్రధాన కార్యదర్శి ఐలయ్య, పట్టణ అధ్యక్షులు గొడుగు శ్రీధర్, పాల్వంచ పట్టణ అధ్యక్షులు రేపాక రమేష్, మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఎండి సలీం, పట్టణ కార్యదర్ని లెనిన్ కిరణ్ ఇతర నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు.
Comment List