సామ్యవాద సాకారానికి పాటు పడిన సమాజ సంస్కర్త బసవేశ్వరుడు

పాలకుర్తి లో ఘనంగా 891వ బసవ జయంతి వేడుకలు

By Venkat
On
సామ్యవాద సాకారానికి పాటు పడిన సమాజ సంస్కర్త బసవేశ్వరుడు

ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ భండారు ఉమామహేశ్వర రావు

పాలకుర్తి : సామ్యవాద సాకారానికి పాటు పడిన సమాజ సంస్కర్త, ఆదర్శ సమాజ నిర్మాణానికి పునాదులు వేసిన పునీతుడు బసవేశ్వరుడని

శ్రీ శైవ మహా పీఠం వరంగల్ శాఖ అధ్యక్షులు, ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ భండారు ఉమామహేశ్వర రావు అన్నారు. శుక్రవారం బసవేశ్వరుని 891 వ జయంతి వేడుకలు ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన పరిసరాలలోని సోమనాథ స్మృతి వనం లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 

బసవేశ్వరుని విగ్రహానికి ఆహుతులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం కళ్యాణ మంటపం లో ఏర్పాటు చేసిన కార్యక్రమం సోమనాధ కళా పీఠం అధ్యక్షులు రాపోలు సత్యనారాయణ అధ్యక్షతన జరుగగా ముఖ్య అతిథిగా ఉమా మహేశ్వర రావు పాల్గొని మాట్లాడారు. ప్రపంచంలో మొదటి సంసద సంస్థ (పార్లమెంట్) రూపకల్పన చేసింది బసవేశ్వరుడని అన్నారు. ఆచారాల పేరుతో పాతుకు పోతున్న మూఢాచారాలను ధిక్కరించిన హేతువాదని అన్నారు. అస్పృశ్యత వంటి దురాచారాలను తునునాడిన వీర శైవుడని శివ భక్తి అనే ఏక సూత్రంతో ప్రజలను ఏకం చేసిన విశ్వ గురువు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో శ్రీ శైవ మహా పీఠం వరంగల్ శాఖ కార్యదర్శి ముదిగొండ విశ్వనాథం, కోశాధికారి కస్తల రామలింగేశ్వర రావు, శివపురం వీరభద్రయ్య, పులిపాక రాజవీరు, సోమనాథ కళాపీఠం కార్యదర్శి ఇమ్మడి దామోదర్, కోశాధికారి రాపాక విజయ్, నీలిమ, సభ్యులు బజ్జూరి వేణుగోపాల్, మెరుగు మధు సూదన్, గూడూరు లెనిన్, దేవస్థానం అర్చకులు దేవగిరి లక్ష్మన్న, దేవగిరి అనిల్,తెలంగాణ అర్చక ఉద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డి వి ఆర్ శర్మ, సిబ్బంది కొత్తపల్లి వెంకటయ్య, ఆంజనేయులు,వీరమనేని యాకాంత రావు, గజ్జి సంతోష్, పులి గణేశ్,పోతన సాహిత్య కళా వేదిక అధ్యక్షులు మాన్యపు భుజేందర్, వన్నాల ధనుంజయ తదితరులు పాల్గొన్నారుIMG-20240510-WA0777

Views: 5
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

డిబిఎం 59 కేనాల్ కాల్వ దారి నాది... ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి కథనానికి స్పందించిన ఇరిగేషన్ అధికారులు* డిబిఎం 59 కేనాల్ కాల్వ దారి నాది... ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి కథనానికి స్పందించిన ఇరిగేషన్ అధికారులు*
డిబిఎం 59 కెనాల్ కాల్వ ఎంతవరకు ఉందో రెండు వైపులా దారిని పూర్తిచేస్తాం త్వరలో హద్దులు కూడా నిర్మిస్తాం.*శ్రీనివాస్ రావు, ఇరిగేషన్ ఏఈ*8 గుంటలు ఆక్రమించారు వినోద్...
డిబిఎం 59 కేనాల్ కాల్వ దారి నాది... ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి కథనానికి స్పందించిన ఇరిగేషన్ అధికారులు
సీనియర్ అసిస్టెంట్ కొలిపాక సుమన్ అరెస్టు, రిమాండ్ కు తరలింపు...
వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ  ఎన్నికల బీజేపీ సన్నాహక సమావేశం
డి బి ఎం 59 కేనాల్ కాల్వ దారి నాది... ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి
డి బి ఎం 59 కేనాల్ కాల్వ దారి నాది... ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి
డి బి ఎం 59 కేనాల్ కాల్వ దారి నాది... ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి